Breaking News

Day: June 16, 2020

ఫుట్​బాలర్​ సేంద్రియ సేద్యం

న్యూఢిల్లీ: కరోనా లాక్​ డౌన్​తో ఇళ్లకే పరిమితమైన ఆటగాళ్లు కొత్త వ్యాపకాలతో బిజీగా ఉంటున్నారు. ఎక్కువ మంది సామాజిక మధ్యమాల్లో గడుపుతుంటే.. మరికొందరు వ్యవసాయంలో సేద తీరుతున్నారు. భారత ఫుట్​బాల్​ జట్టు మాజీ కెప్టెన్ గౌరీమాంగ్ సింగ్ కూడా తన పొలంలో సేంద్రియ సేద్యం చేస్తూ ఉత్సాహం పొందుతున్నాడు. ఇంఫాల్​లో సోదరులతో కలిసి కూరగాయలు పండిస్తున్నాడు. ‘మా ఇంటి పక్కనే కొంత పొలం ఉంది. రెండేళ్ల నుంచి అక్కడ కూరగాయలు పండిస్తున్నాం. అయితే లాక్​డౌన్​తో నేను కూడా […]

Read More

కోహ్లీ.. కెప్టెన్​గా ఏదీ సాధించలేదు

న్యూఢిల్లీ: బ్యాట్స్​మెన్​గా ఎంతో ఎత్తుకు ఎదిగిన విరాట్ కోహ్లీ.. టీమిండియా కెప్టెన్​గా సాధించింది ఏమీ లేదని మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ విమర్శించాడు. కెరీర్​లో సారథిగా చాలా సాధించాల్సి ఉందన్నాడు. అతిముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటితేనే.. గొప్ప కెప్టెన్ల జాబితాలో చోటు దక్కుతుందన్నాడు. చూడటానికి టీమిండియా బలంగా కనిపిస్తున్నా.. అధిగమించాల్సిన బలహీనతలు కూడా ఉన్నాయన్నాడు. ‘జట్టులోని ఆటగాళ్ల బలాలు, బలహీనతలను గుర్తించి ప్రోత్సహించాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలే మెగా ఈవెంట్లలో రాణించడానికి […]

Read More

ఆస్ట్రేలియాలో సచిన్, కోహ్లీ వీధులు

మెల్​బోర్న్: ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లకు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. వాళ్లకు సంబంధించిన వస్తువులు, ఫొటోలను అభిమానులు తమ ఇళ్లలో పెట్టుకుని ఆరాధిస్తుంటారు. అలాంటి క్రికెటర్లలో సచిన్, కపిల్, కోహ్లీ.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దగానే ఉంటుంది. అయితే ఆసీస్​లో అభిమానులు మరో అడుగు ముందుకేస్తూ తమ వీధులకు క్రికెటర్ల పేర్లను పెట్టుకున్నారు. మెల్​బోర్న్​లోని రాక్​బ్యాంక్ ప్రాంతంలోని ఓ ఎస్టేట్​లో వీధులకు ‘టెండూల్కర్ డ్రైవ్’,‘కోహ్లీ క్రీసెంట్’, ‘దేవ్ టెర్రెస్’ అని పేర్లు పెట్టుకున్నారు. మెల్టన్ కౌన్సిల్లోకి […]

Read More

నెగెటివ్ వస్తే.. ఉమ్మి రుద్దనివ్వండి

న్యూఢిల్లీ: సిరీస్​కు ముందు జరిపే కరోనా పరీక్షల్లో నెగెటివ్ వస్తే.. వాళ్లు ఉమ్మిని ఉపయోగించేందుకు అవకాశం ఇవ్వాలని టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగర్కార్ కోరాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మిపై నిషేధం మంచిదే అయినా.. రాబోయే రోజుల్లో బౌలర్లు బాగా ఇబ్బందిపడాల్సి వస్తుందన్నాడు. ‘బ్యాట్స్​మెన్​కు బ్యాట్ ఎంత ముఖ్యమో.. బౌలర్లకు ఉమ్మి కూడా అంతే. మ్యాచ్​కు ముందే ప్లేయర్లకు కరోనా టెస్టులు నిర్వహిస్తారు. అందులో నెగెటివ్ వస్తే వాళ్లు సురక్షితమేనని భావిస్తారు. అలాంటి వాళ్లకు ఉమ్మిని ఉపయోగించే […]

Read More

ధోనీ.. ఓ దిగ్గజం

మెల్​బోర్న్: ప్రపంచ క్రికెట్లో మాజీ సారథి ధోనీ ఓ దిగ్గజమని ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. క్రికెట్​కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలిసిన ఓ గొప్ప పండితుడని కొనియాడాడు. ‘మహీ దిగ్గజం, మిస్టర్ కూల్. క్రికెట్ కోసమే పుట్టాడు. ఆట అంటే అతనికి పిచ్చి’ అని స్మిత్ వ్యాఖ్యానించాడు. జట్టులో మహీ ఉండడం విరాట్​కు కొండంత అండని చెప్పాడు. ఇక ఇప్పుడున్న క్రికెటర్లలో రవీంద్ర జడేజా.. అత్యుత్తమ ఫీల్డర్ అని స్మిత్ కితాబిచ్చాడు. యువతరం […]

Read More

ఏడు నిమిషాల్లో కోచ్​నయ్యా

న్యూఢిల్లీ: భారత జట్టుకు కోచ్​గా ఎంపికవడానికి తనకు ఏడు నిమిషాల సమయం పట్టిందని దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్​మెన్​ గ్యారీ కిర్​స్టెన్​ వెల్లడించాడు. తనకు ఆసక్తి లేకపోయినా.. కనీసం దరఖాస్తు చేయకపోయినా ఆ పదవి తనకు దక్కిందన్నాడు. దీనికంతటికి కారణం అప్పటి సెలెక్షన్ కమిటీ మెంబర్, దిగ్గజ బ్యాట్స్​మెన్​ సునీల్ గవాస్కర్ అని స్పష్టం చేశాడు. ‘2007లో గ్రెగ్ చాపెల్ వారసుడి కోసం బీసీసీఐ అన్వేషిస్తోంది. ఆ సమయంలోనే నాకు టీమిండియాకు కోచింగ్ ఇచ్చే ఆసక్తి ఉందా? సన్నీ […]

Read More

ప్రతిష్టాత్మకంగా హరితహారం

సారథి న్యూస్​, హైదరాబాద్​: వికారాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. వికారాబాద్, తాండూర్, పరిగి పట్టణాల పట్టణాల అభివృద్ధిపై చర్చ జరిగింది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో హరితహారం కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. పట్టణాల్లో పార్కులు. ఫుట్ పాత్ రోడ్లు, టాయిలెట్లు, శ్మశాన వాటికల పనులపై సూచనలు చేశారు. సమావేశంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ […]

Read More