సారథి న్యూస్, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లాలో ఖాళీగా ఉన్న 9 పంచాయతీ కార్యదర్శి పోస్టులు(రెగ్యులర్, జూనియర్) తాత్కాలిక ప్రాతిపదికన మెరిట్ లిస్ట్ నుంచి ఎంపిక చేసేందుకు ధ్రువీకరణ పత్రాలను ఈనెల 6న ఉదయం10.30 గంటలకు జిల్లా పంచాయతీ ఆఫీసులో పరిశీలిస్తామని కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు. ఈ మేరకు మెరిట్ లిస్టును 1:3 నిష్పత్తిలో జిల్లా పంచాయతీ ఆఫీసులో నోటీస్ బోర్డులో ప్రదర్శించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకొనేందుకు విజయ్ ముందుకొచ్చి ఎంసీఎఫ్ (మిడిల్ క్లాస్ ఫండ్)ను ఏర్పాటు చేశాడు. దీంతో ముందుగా రూ.25లక్షలతో రెండువేల మందికి సాయం చేద్దామనుకున్నాడు. తన ఆలోచన సక్సెస్ కావడంతో ఎంసీఎఫ్ ద్వారా విజయ్ కొన్నివేల మధ్యతరగతి కుటుంబాలకు సాయాన్ని అందించాడు. తన ఫౌండేషన్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తూనే ఉన్నాడు విజయ్. ఎంత […]
అడవుల్లో కార్చిచ్చులు.. తుఫానులు.. భూకంపాలు .. కొద్ది రోజులుగా ప్రకృతి తన కోపానికి ప్రపంచం యావత్తునూ బలి తీసుకుంటూనే ఉంది. వీటితో పాటు భయంకరమైన వైరస్లు మనుషుల ఆయుష్షును తగ్గించేస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తించండి అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ‘మనమందరం నివశించే పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి వ్యక్తిగత బాధ్యత..’ అని దలైలామా కొటేషన్‌ను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ‘ప్రకృతి, మనం […]
సారథి న్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ కమినషరేట్‌లోని మట్వాడ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో చనిపోయిన కానిస్టేబుల్ కె.సదానందం సతీమణి రమాదేవికి వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ చేయూత పథకం కింద రూ.లక్షన్నర చెక్కును శుక్రవారం అందజేశారు. కానిస్టేబుల్ కుటుంబ స్థితిపరిస్థితులను కమిషనర్ అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వపరం అందాల్సిన బెనిఫిట్స్‌ను తక్షణమే అందేలా చూడాలని పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్ గౌడ్‌కు సూచించారు.
సారథి న్యూస్, తలకొండపల్లి: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఏడీఏ రాజారత్నం హెచ్చరించారు. శుక్రవారం తలకొండపల్లి అగ్రికల్చర్ ఆఫీసులో విత్తనాలు, ఎరువుల డీలర్లకు సమావేశం నిర్వహించారు. గుర్తింపు పొందిన విత్తనాలనే రైతులకు విక్రయించాలని సూచించారు. కలుపు నివారణకు వాడే గ్లైకోసెల్ మందును అక్టోబర్ 30వ తేదీ వరకు అమ్మకూడదని సూచించారు. రైతన్నలు అధికారుల సూచనలు పాటించాలన్నారు. ఈ సీజన్లో పత్తి, వరి పంటలు వేయాలన్నారు. సమావేశంలో స్థానిక ఎస్సై సురేష్ […]
సారథి న్యూస్, ఖమ్మం: కృష్ణానది నీటిని అక్రమంగా తరలించుకుపోయేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోనం. 203 అమలైతే.. దక్షిణ తెలంగాణతో పాటు ఖమ్మం జిల్లాకు సాగునీరు అందక ఎడారిగా మారడం ఖాయమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన సంగమేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి శుక్రవారం ఆయన ఖమ్మం జిల్లా గోళ్లపాడులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండితేనే నాగార్జునసాగర్ కు నీళ్లు వస్తాయన్నారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా […]
కోలీవుడ్‌లో ఆర్ జే బాలాజీ ఓ డివోషనల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. పేరు ‘మూకుత్తి అమ్మన్’. టైటిల్ రోల్ సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార పోషిస్తున్నారు. ఈ చిత్రంలో నయన్ భక్తురాలిగా, అమ్మవారిగా రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనుంది. భక్తిరస ప్రధానంగా సాగే ఈ సినిమాలో నటించేందుకు తనకెంతో ఆనందంగా ఉందంటూ.. ఈ సినిమా షూటింగ్ మొదలయినప్పటినుంచీ నయన్ నాన్‌వెజ్ తినడం మానేసి చాలా నిష్టగా ఉందట. అలాగే యూనిట్ మొత్తం కూడా శాఖాహారాన్నే తీసుకున్నారట. […]
సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఎవరో నాకు తెలీదంటూ మీరాచోప్రా చేసిన కమెంట్స్ ఓ సంచలనాన్ని క్రియేట్ చేస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమె పట్ల ప్రవర్తించిన విధానాలు మరింత సంచలనం సృష్టించాయి. కానీ లేటెస్ట్గా ‘ఊసరవెల్లి’ సినిమాలో హీరోయిన్ తమన్నా ఫ్రెండ్ పాత్రలో నటించిన పాయల్ ఘోష్ ట్విట్టర్లో చేసిన ట్వీట్ ఈ హాట్ వెదర్ని కాస్త కూల్ చేసిందనే చెప్పొచ్చు. ‘ఊసరవెల్లి షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతుండగా మేము మా కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. అది […]