ఎమ్మెల్యే మదన్ రెడ్డి సారథి న్యూస్, నర్సాపూర్: ‘నర్సాపూర్ మెదక్ హైవే పనులు పూర్తయినయ్.. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని’ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సూచించారు. బుధవారం కొల్చారం మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం పోతంశెట్టిపల్లి వద్ద ఫోర్ లేన్ రోడ్డు పనులను ప్రారంభించారు. సరుకుల పంపిణీకి సహకరించిన సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు పనులు పూర్తయిన నాటినుంచి ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. […]
ఐటీసీ నుంచి పోలీసు సిబ్బందికి డ్రింక్స్ పంపిణీ సారథి న్యూస్, గోదావరిఖని: పోలీస్ సేవలను ప్రశంసిస్తూ ఐటీసీ జ్యూస్ ఉత్పత్తులను సంస్థ తరఫున మేడి ప్రవీణ్ బుధవారం రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణకు అందజేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్ డౌన్ విజయవంతం చేసేందుకు పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్, ఏసీపీ ఏఆర్ సుందర్ రావు, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ బుద్దె స్వామి, ఆర్ఐ మధుకర్ గునిశెట్టి […]
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ లుసానే: టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించేందుకు చివరి తేదీ వచ్చే ఏడాది జూన్ 29. ఈ లోగా అన్ని అర్హత టోర్నీలను పూర్తి చేయాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) సూచించింది. వీలైనంత త్వరగా క్వాలిఫయింగ్ తేదీలను ప్రకటించాలని వెల్లడించింది. క్వాలిఫయింగ్ డ్రాఫ్ట్ ను రూపొందించడానికి సాయం చేయాలని సూచించింది. ‘అంతర్జాతీయ సమాఖ్యల క్యాలెండర్ లో టోర్నీల తేదీలు, వేదికలపై స్పష్టత లేదు. అందుకే వీలైనంత త్వరగా టోర్నీలు నిర్వహించాలి. తేదీలు, వేదికలను […]
కింగ్స్టన్: రన్నింగ్ ట్రాక్‌పై స్వర్ణాల రికార్డులను సృష్టించిన జమైకా మేటి స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్.. నిజజీవితంలో తండ్రిగా ప్రమోషన్ సాధించాడు. అతని భాగస్వామి క్యాసి బెన్నెట్ ఆదివారం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. బోల్ట్ దంపతులకు ఇదే తొలి సంతానం. బోల్ట్ తండ్రయిన విషయాన్ని జమైకా ప్రధాని ఆండ్రూ హోల్ నెస్ సోషల్ మీడియాలో ధ్రువీకరించారు. ‘మా స్ప్రింట్ లెజెండ్ బోల్ట్, బెన్నెట్‌కు కూతురు పుట్టింది. ఓ అందమైన అమ్మాయిని ఈ భూమి మీదకు తీసుకొచ్చినందుకు మీకు నా […]
స్వతంత్ర కమిటీని నియమించిన పీసీబీ కరాచీ: తనపై విధించిన మూడేళ్ల నిషేధంపై పాక్ బ్యాట్స్ మెన్ఉమర్ అక్మల్ అప్పీల్‌కు వెళ్లాడు. దీంతో ఈ కేసును విచారించేందుకు పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్వతంత్ర కమిటీని నియమించింది. విచారణ సందర్భంగా తన వాదనలను బలంగా వినిపించేందుకు బాబర్ అవాన్ కు చెందిన లా ఫర్మ్ ను అక్మల్ ఉపయోగించుకోనున్నాడు. అవాన్.. పాక్ ప్రధాని ఇమ్రాన్ కు పార్లమెంటరీ అఫైర్స్ సలహాదారుడిగా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ […]
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ న్యూఢిల్లీ: త్రోడౌన్స్ వల్ల పేస్ బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొంటున్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కొన్నేళ్లుగా ఇందులో తమ ప్రదర్శన చాలా మెరుగుపడిందన్నాడు. త్రోడౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర దీనికి కారణమని కితాబిచ్చాడు. ‘కొన్నేళ్లుగా మేం పేస్ బౌలింగ్‌ను ఎలాంటి భయం లేకుండా ఆడుతున్నాం. 155 కేఎంపీహెచ్ వేగంతో వచ్చిన బంతులను కూడా అద్భుతంగా ఎదుర్కొంటున్నాం. చాలా పురోగతి కనిపిస్తోంది. దీనికి కారణం రఘు అని తెలుసు. ఫుట్ వర్క్, […]
టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ తన కెరీర్ ఆరంభంలో స్టేట్ క్రికెట్‌కు ఎంపిక చేయడానికి క్రికెట్ అధికారులు లంచం అడిగారని కోహ్లీ తనకు చిన్నప్పుడు ఎదురైన చేదు ఘటనను గుర్తు చేసుకున్నాడు. అయితే తన తండ్రి ప్రేమ్ కోహ్లీ లంచం ఇవ్వడానికి ఒప్పుకోలేదని వెల్లడించాడు. ‘స్టేట్ క్రికెట్‌కు ఆడడానికి ఓ కోచ్ లంచం అడిగాడు. కానీ మా నాన్న ఇవ్వలేదు. నీవు మెరిట్‌తో ఆడగలిగితేనే క్రికెట్‌లో కొనసాగిస్తా. లేదంటే ఆడించను’ అని నాతో చెప్పాడు. ‘దీంతో నేను సెలెక్ట్ […]
టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ న్యూఢిల్లీ: ప్లేయర్ ప్రదర్శన మెరుగుపడాలంటే కోచ్ తో బలహీనతలను కూడా చర్చించాలని టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. కోచ్, ప్లేయర్ మధ్య బలమైన బంధం ఉంటేనే ఇది సాధ్యమవుతుందన్నాడు. ‘మానసిక బలం కావొచ్చు, నైపుణ్యాభివృద్ధి కావొచ్చు.. కోచ్ ఎవరైనా బాగా నమ్మకం ఉంచుకోవాలి. పరస్పర నమ్మకం ఉన్నప్పుడే ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడుతుంది. అప్పుడే ప్లేయర్ తన బలహీనతలు, భయాలు, ఆందోళన గురించి […]