మహారాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు పుణె: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో జైళ్లలో రద్దీని తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 7,200 మంది ఖైదీలను రిలీజ్ చేసింది. మరో 10వేల మందిని రిలీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. వాళ్లందరినీ టెంపరరీ బెయిల్, పెరోల్ మీద పెట్టారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ నిర్ణయం ప్రకారం ఏడేళ్ల వరకు శిక్షపడ్డ ఖైదీలను టెంపరరీగా వదిలిపెట్టామన్నారు. ‘లాక్ డౌన్‌కు ముందు రాష్ట్రంలోని 60 […]
ప్రభుత్వం సంచలన నిర్ణయం భోపాల్: టెన్త్‌క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ కు సంబంధించి మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా వాయిదాపడ్డ పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఇంతకు ముందు నిర్వహించిన ఎగ్జామ్స్ ఆధారంగా మార్కులు వేయనున్నట్లు చెప్పారు. దాని ప్రకారమే జాబితా ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. వాయిదాపడ్డ ఎగ్జామ్స్‌కు సంబంధించి ‘పాస్’ రిమార్క్‌తో మార్క్ షీట్ ఇవ్వనున్నారు. కాగా,జూన్ 8 నుంచి 16 వరకు […]
భారత ఒలింపిక్ అసోసియేషన్ న్యూఢిల్లీ: పోస్ట్ కరోనాలో గేమ్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా షురూ కావాలంటే రూ.200 కోట్ల గ్రాంట్ ఇవ్వాలని భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) కేంద్ర క్రీడాశాఖకు విజ్ఞప్తి చేసింది. దేశంలో అన్ని క్రీడాసమాఖ్యలకు ఆర్థికసాయం చేయాలని కోరింది. ‘వచ్చే ఏడాది వరకు స్పాన్సర్లు రారు. ఈ సమయంలో ప్రభుత్వ సాయం చాలా అవసరం. గ్రాంట్ ఇవ్వకపోతే గేమ్స్‌ను మొదలుపెట్టడం చాలా కష్టమవుతుంది. ఐవోఏకు రూ.10 కోట్లు, జాతీయ సమాఖ్యలకు రూ. 5కోట్లు, నాన్ […]
ఆస్ట్రేలియా మాజీకెప్టెన్ మార్క్ టేలర్ మెల్ బోర్న్: కరోనా వైరస్ నేపథ్యంలో ఆస్ర్టేలియాలో టీ20 ప్రపంచకప్ జరుగుతుందా? లేదా? అన్న సందేహాలు మొదలయ్యాయి. ఈనెల 28న ఐసీసీ సమావేశంలో దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ టీ20 ప్రపంచకప్ వాయిదాపడితే.. ఐపీఎల్ కు మార్గం సుగమమైనట్లేనని ఆస్ర్టేలియా మాజీకెప్టెన్ మార్క్ టేలర్ అన్నాడు. ఆ సమయంలో అన్ని దేశాలు ఖాళీగా ఉంటాయి కాబట్టి లీగ్‌ను నిర్వహించేందుకు ఈజీగా ఉంటుందన్నాడు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్ […]
న్యూఢిల్లీ: కొంతమంది జూనియర్ క్రికెటర్లకు జన్ ధన్ అకౌంట్లు ఉండడంతో వార్షిక అవార్డులకు సంబంధించిన డబ్బులు సకాలంలో ఇవ్వలేకపోయామని బీసీసీఐ వెల్లడించింది. అయితే బ్యాంకర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని తెలిపింది. ‘కొంతమంది జూనియర్ క్రికెటర్లు బీసీసీఐ వార్షిక అవార్డులను గెలుచుకున్నారు. వాళ్లకు రూ.1.5 లక్షల నగదు పురస్కారం ఇవ్వాల్సి ఉంది. సీనియర్ క్రికెటర్లు అందరికీ జనవరి 11న డబ్బులు పడిపోయాయి. జూనియర్లకు పడలేదు. చాలాసార్లు ట్రాన్స్ ఫర్ చేసి విఫలమయ్యాం. సమస్యను బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్లాం. వాళ్లవి […]
పాక్ క్రికెట్ బోర్డు కరాచీ: కరోనాను పక్కనబెడుతూ పాకిస్థాన్, ఇంగ్లండ్ పర్యటన కోసం సిద్ధమవుతోంది. మూడు టెస్ట్‌లు, మూడు టీ20 కోసం జులైలో అక్కడ పర్యటిస్తామని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది. ఈ పర్యటనపై క్రికెటర్లకు అనుమానాలు ఉంటే.. వాళ్లను రమ్మని బలవంతం చేయబోమని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీమ్ ఖాన్ తెలిపాడు. ‘మ్యాచ్‌లన్నీ ఖాళీ స్టేడియాల్లో జరుగుతాయి. గ్రౌండ్‌లోనే హోటల్ రూమ్స్ ఉంటాయి. పర్యటనకు రావాలా? వద్దా? అనేది ప్లేయర్ల ఇష్టం. ఒకవేళ రాకపోయినా […]
ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆచితూచి బౌలింగ్ చేయాలని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ అన్నాడు. ఒక్క చెత్త బంతి వేసినా మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నాడు. బంతులు వేయడంలో చాలా నియంత్రణతో పాటు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలన్నాడు. ‘సచిన్ బ్యాటింగ్ చేస్తుంటే బౌలర్ కు ఏదో తెలియని ఆందోళన కలుగుతుంది. ఇందులో సందేహం లేదు. ఒక్క చెత్తబంతి వేసినా మాస్టర్‌కు కుదురుకునే అవకాశం ఇచ్చినట్లే. ఆ తర్వాత అలవోకగా 500 […]
19 నుంచి ఆర్టీసీ బస్సులను నడిపించే యోచనలో ప్రభుత్వం నేడు మంత్రి మండలిలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్డెక్కనున్నాయి. మంగళవారం నుంచి ప్రజారవాణా సేవలు ప్రారంభంకానున్నాయి. కేంద్ర తాజా మార్గదర్శకాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బస్సులను నడిపించాలని నిర్ణయించినట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు సీఎం అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఆర్టీసీ బస్సులకు అనుమతివ్వడంతో పాటు లాక్ డౌన్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై […]