Breaking News

Day: May 18, 2020

బస్సులు, ఆటోలు నడుస్తయ్​

బస్సులు, ఆటోలు నడుస్తయ్​

క్లబ్​లు, పబ్​లు, జిమ్ లు బంద్​ కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి హైదరాబాద్​ మెట్రోరైల్​ బంద్ సెలూన్లు తెరుచుకోవచ్చు ఈ-కామర్స్‌ ను అనుమతిస్తున్నం ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్​ నిర్ణయం సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో మే 31 వరకు లాక్‌ డౌన్‌ కొనసాగిస్తామని సీఎం కేసీఆర్​ స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు, ఆటోలు నడుస్తాయని వెల్లడించారు. కంటైన్​మెంట్​ ఏరియాలు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలను గ్రీన్‌ జోన్లుగా ప్రకటించారు. కేంద్రం ప్రకటించిన లాక్‌ డౌన్ నేపథ్యంలో […]

Read More
మన సోనా షుగర్‌ ఫ్రీ రైస్‌

మన సోనా షుగర్‌ ఫ్రీ రైస్‌

ప్రభుత్వం చెప్పిన పంటలే వేయాలి, అధికారులు చెప్పాలె మన పంట హాట్​ కేకుల్లా అమ్ముడుపోవాలె: సీఎం కేసీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్‌: ఏ పంటను ఎలా..ఎప్పుడు పండించాలనేది ప్రభుత్వమే చెబుతుందని సీఎం కేసీఆర్​ స్పష్టంచేశారు. వరిలో ఏయే రకాలు వేస్తే లాభమో అవి మాత్రమే వేయాలని రైతులను కోరారు. వర్షాకాలంలో మక్క పంట వేయొద్దు.. బదులుగా కందులు వేయాలని సూచించారు. ప్రభుత్వం చెప్పిన విధంగా వేయకపోతే వారికి రైతుబంధు రాదని స్పష్టంచేశారు. నియంత్రిత పద్ధతితో వ్యవసాయం చేయాలన్నారు. […]

Read More
రాష్ట్రాలను భిక్షగాళ్లను చేస్తరా?

రాష్ట్రాలను భిక్షగాళ్లను చేస్తరా?

కేంద్ర ప్యాకేజీ అంకెల గారడీ కేంద్రం వైఖరి నియంతృత్వంగా ఉంది ప్యాకేజీ వట్టి పచ్చి దగా, మోసం: సీఎం కేసీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్‌: కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ వట్టి పచ్చి దగా, మోసం అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ పై ఆయన స్పందించారు. కేంద్ర ప్యాకేజీ అంకెల గారడీ అని అంతర్జాతీయ పత్రికలే చెబుతున్నాయని అన్నారు. ‘రాష్ట్రాల పట్ల కేంద్ర వైఖరి నియంతృత్వంగా ఉంది. ఆర్థికంగా నిర్వీర్యమైన […]

Read More
మహాదేవపురంలో ఒకరికి కరోనా

మహాదేవపురంలో ఒకరికి కరోనా

సారథి న్యూస్​, ఖమ్మం: ఖమ్మం జిల్లా మధిర మండలం మహాదేవపురం గ్రామంలో కరోనా(కోవిడ్​–19) పాజిటివ్ కేసు నమోదైనట్లు డీఎంహెచ్​వో మాలతి సోమవారం తెలిపారు. ఇటీవల ఆ గ్రామానికి ముంబై నుంచి 17 మంది ప్రత్యేకబస్సులో వచ్చారు. వారిలో ఏడుగురిని కరోనా టెస్ట్​లకు పంపించగా, వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు ఆమె వెల్లడించారు.

Read More
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఉందిగా..

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఉందిగా..

లాక్ డౌన్ పేరుతో దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. ఈ సమస్యతో సినీపరిశ్రమకు తీరని నష్టమే కలిగింది. అలాగే ఫిల్మ్ మేకర్స్ కూడా అన్ని కార్యక్రమాలు పూర్తయినా సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియక టెన్షన్ పడుతున్నారు. ఈ సమయంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్​ కే ఓటు వేస్తున్నారు చాలామంది చిత్ర నిర్మాతలు. వారి సినిమాలను డిజిటల్ ఫ్లాట్​ ఫామ్​ లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ‘అమృతారామమ్’ అనే సినిమా తెలుగులో ఇప్పటికే రిలీజ్ […]

Read More
టైమ్ పడుతుంది..

టైమ్ పడుతుంది..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే భారీ అంచనాలతో ఉంటుందనే ఆతృత ఉండడం సహజమే. ఆయన గురించి వచ్చే ప్రతి అప్​ డేట్స్​ను ఫాలో అవుతుంటారు చాలామంది ఫ్యాన్స్​. ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ప్రభాస్ తర్వాత ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్​తో చేయనున్నాడని అధికారిక ప్రకటన వచ్చిన నాటి నుంచి ఆ సినిమా అప్​ డేట్స్​ కోసం తెగ ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఇందులో బాలీవుడ్ […]

Read More
క్రికెట్​ను కాపాడుకుందాం

క్రికెట్​ను కాపాడుకుందాం

న్యూజిలాండ్ ఆల్​ రౌండర్​ జిమ్మీ నీషమ్ వెల్లింగ్టన్: కరోనాదెబ్బకు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన క్రికెట్​ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని న్యూజిలాండ్ ఆల్​ రౌండర్​ జిమ్మీ నీషమ్ అన్నాడు. ఇందుకోసం కొత్త పద్ధతులను అలవాటు చేసుకోవాలన్నాడు. ఖాళీస్టేడియాల్లో క్రికెట్ ఆడేందుకు అందరూ అలవాటుపడాలని చెప్పాడు. తద్వారా ఆటతో పాటు ఆటగాళ్లు కూడా ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతారన్నాడు. ‘ఈ గడ్డుకాలం నుంచి బయటపడడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఖాళీ స్టేడియాల్లో, ఫ్యాన్స్ లేకుండా క్రికెట్ ఆడడం […]

Read More
ఐపీఎల్ జరుగుతుంది

ఐపీఎల్ జరుగుతుంది

ఆర్‌సీబీ డైరెక్టర్‌ మైక్‌హెస్సన్‌ ముంబై: కరోనా దెబ్బకు ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడినా చాలా మందికి లీగ్‌పై నమ్మకం పోలేదు. ఈ ఏడాది ఏదో ఓ టైమ్‌లో కచ్చితంగా ఐపీఎల్‌ జరిగి తీరుతుందని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ మైక్‌హెస్సన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. లీగ్‌ ఎప్పుడు జరిగినా ఆర్‌సీబీ రెడీగా ఉంటుందన్నాడు. ‘మాకు ఇంకా నమ్మకం ఉంది. ఐపీఎల్‌కు టైమ్‌ ముగిసిపోలేదు. కచ్చితంగా జరిగి తీరుతుంది. పరిస్థితులను సమీక్షించిన తర్వాత బీసీసీఐ దీనిపై […]

Read More