పదవికి గుడ్ చెప్పనున్న ఈసీబీ చైర్మన్ లండన్: ‘హండ్రెడ్ బాల్’ టోర్నీ వాయిదా పడడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ పదవి నుంచి దిగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 31వ తేదీ తర్వాత ఈ పోస్ట్ కు గుడ్ బై చెప్పనున్నాడని ఈసీబీ ప్రకటించింది. మే 2015లో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గ్రేవ్స్ ఐసీసీలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అంతర్జాతీయ బాడీ చైర్మన్ శశాంక్ మనోహర్ వారసుడిగా ఇప్పటికే అతని […]
– ఆసిస్ కోచ్ జస్టిన్ లాంగర్ మెల్ బోర్న్: టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంక్ దక్కినప్పటికీ ఇండియా గడ్డపై టీమిండియాను ఓడించడమే తమ అసలు టార్గెట్ అని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. లేదంటే తమ టాప్ ప్లేస్ మరోసారి ప్రమాదంలో పడినట్టేనని హెచ్చరించాడు. ‘ఈ ర్యాంక్లను ఎలా ప్రకటించారో మేం గుర్తించగం. అయితే ఈ సమయంలో టాప్ ప్లేస్ రావడం మా ముఖాల మీదకు నవ్వు తెప్పించింది. మేం కోరుకున్నట్లుగా మంచి టీమ్ గా […]
కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజిజు న్యూఢిల్లీ: దేశంలో ఫుట్ బాల్ ను మరింత మెరుగుపర్చేందుకు టాప్ కార్పొరేట్ కంపెనీలు, స్టేట్, డిస్ర్టిక్ బాడీలు ఇతోధికంగా సాయం చేయాలని కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజిజు కోరారు. గ్రాస్ రూట్ లెవెల్లో ఈ క్రీడను అభివృద్ధి చేయాలని సూచించారు. భారత్ లో ఫుట్ బాల్ కల్చర్ ను ఎలా వృద్ధి చేయాలనే దానిపై మంత్రి తన దృక్పథాన్ని వెల్లడించారు. ‘పాఠశాల స్థాయిలో ఫుట్ బాల్‌ను ప్రవేశపెట్టాలి. స్థానికంగా లీగ్ లు […]
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగాల్సిన కామన్ వెల్త్ యూత్ గేమ్స్ ను రెండేళ్ల పాటు వాయిదావేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ గేమ్స్ 2021 ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు జరగాల్సి ఉంది. కానీ 2020 టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ కావడంతో కామన్ వెల్త్ గేమ్స్‌ను వాయిదా వేయక తప్పలేదని గేమ్స్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ప్రకటించింది. రీ షెడ్యూల్ ప్రకారం టోక్యో ఒలింపిక్స్ జులై 23 నుంచి ఆగస్టు 8వ […]
–రికార్డు ఛేజింగ్ లో ఆడిన బ్యాట్ కేప్ టౌన్: కరోనా నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లు కూడా ముందుకొస్తున్నారు. తమ వంతుగా ఎంతో కొంతసాయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ హెర్షల్ గిబ్స్ తన బ్యాట్ ను వేలం వేయనున్నాడు. అయితే ఇది సాధారణ బ్యాట్ కాదు. వన్డేల్లో ప్రపంచ రికార్డు ఛేజింగ్ లో ఆడిన బ్యాట్. 14 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా నిర్దేశించిన 435 పరుగుల టార్గెట్ ను […]
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్. ధోనీ తన గురువు అని వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు. యంగ్ ప్లేయర్లకు సాయం చేయడంలో మహీకి ప్రత్యేక పద్ధతి ఉందన్నాడు. సమస్య పరిష్కారానికి చాలా మార్గాలు సూచిస్తాడన్నాడు. ‘ధోనీ నా గురువు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఏ సందేహం వచ్చినా నేను ముందు మహీ బాయ్ కి ఫోన్ చేస్తా. అయితే నా సమస్యకు పూర్తి పరిష్కారం చూపకుండానే అనేక మార్గాలు […]