సారథి న్యూస్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల సెమిస్టర్ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించే విధానం ప్రవేశపెట్టాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఇంటర్ నెట్ స్పీడ్ పెంచడం, బ్యాండ్ విడ్త్, సెక్యూరిటీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. దేశంలోని టెక్నాలజీ వర్సిటీల్లో ఆన్‌లైన్ పరీక్షలపై అధ్యయనం జరుగుతున్నదని జేఎన్టీయూహెచ్ ఇన్ చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు.
సారథి న్యూస్, శ్రీకాళహస్తి: కేవలం 80 వేల జనాభా ఉన్న చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో ఏకంగా 40కి పైగా కరోనా కేసులు నమోదు కావడంతో పట్టణాన్ని అధికారులు అష్టదిగ్బంధం చేశారు. పట్టణంలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి ప్రజలు ఎవరినీ బయ టకు వెళ్లనివ్వబోమని, పాలు, మందులు, నిత్యావసరాలను వలంటీర్ల సాయంతో ఇళ్ల వద్దనే అందిస్తామని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఉదయం […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శనివారం అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురువొచ్చని వెల్లడించారు. పశ్చిమ విదర్భ, దాని పరిసరాల్లో కిలోమీటర్ వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, మరోవైపు ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుందని తెలిపారు.
సారథి న్యూస్, మహబూబ్ నగర్: నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ రెమో రాజేశ్వరి హెచ్చరించారు.శుక్రవారం జిల్లాకేంద్రంలోని తన క్యాంపు ఆఫీసులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సామాజిక దూరం పాటించడం ద్వారానే వ్యాధిని అరికట్టవచ్చన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. పోలీసులు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ‘మీకు సహకారం అందిస్తున్న మీ కుటుంబసభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నా..’ అని అన్నారు.
సారథి న్యూస్, నర్సాపూర్: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో యువకులు పంచాయతీ సిబ్బందికి బియ్యం, కూరగాయలు ఇతర నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజునాయక్, కౌడిపల్లి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామాగౌడ్, సాయిలు, ఉప సర్పంచ్ కొండల్ రెడ్డి, బాలింతలు సొసైటీ డైరెక్టర్ సోమరమేష్ గుప్తా, మాజీ సర్పంచ్ సారయ్యగౌడ్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు శంకర్ ఉన్నారు.
సారథి న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం తాజాగా ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటన్ ను రిలీజ్ చేసింది. కొత్తగా 62 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రకటించింది. ఇలా రాష్ట్రంలో 955కు పాజిటివ్ కేసులు చేరాయి. కర్నూలు జిల్లాలో 27, గుంటూరు 11, అనంతపురం నాలుగు, తూర్పు గోదావరి ఆరు, కృష్ణా 14, ప్రకాశం మూడు, నెల్లూరు జిల్లాలో ఒకటి కేసు చొప్పున కొత్తగా పాజిటివ్ […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: డయల్ యువర్ జేసీ కార్యక్రమానికి 17 వినతులు వచ్చాయి. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డయల్ యువర్ జేసీ కార్యక్రమం నిర్వహించారు. సంయుక్త కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు హాజరై జిల్లాలోని పలువురి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా సరఫరాల అధికారి జి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
సారథి న్యూస్, రంగారెడ్డి: లాక్ డౌన్ నేపథ్యంలో జర్నలిస్టుల కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ సీపీ రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు బోడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దఅంబర్ పేటకు చెందిన వీరమళ్ల వంశీకృష్ణ, అతని స్నేహితులు దివేష్, శ్రీకాంత్, సతీష్ హయత్ నగర్, మన్సురాబాద్ డివిజన్లకు చెందిన ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియా జర్నలిస్టులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీరమళ్ల వంశీకృష్ణ మాట్లాడుతూ..19 రోజులుగా నిరుపేదలను […]