Breaking News

Day: April 21, 2020

జర్నలిస్టులకు నగదు సాయం

జర్నలిస్టులకు నగదు సాయం

సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: జిల్లాకు చెందిన 80 మంది విలేకరులకు రూ.ఐదువేల చొప్పున స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ ​రెడ్డి తన క్యాంపు ఆఫీసులో మంగళవారం అందజేశారు. కరోనా కష్టకాలంలోనూ జర్నలిస్టులు తమ వృత్తికి న్యాయం చేస్తున్నారని ప్రశంసించారు. అంతకుముందు తెలకపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 12మంది లబ్ధిదారులకు  కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. మున్సిపల్​ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, మార్కెట్ […]

Read More
కరోనాను ఆర్సినిక్‌ ఆల్బం–30 మందు

కరోనాకు ఆర్సినిక్‌ ఆల్బం–30 మందు

– విజయనగరం కలెక్టర్‌ హరిజవహర్‌ లాల్‌  సారథి న్యూస్​, విజయనగరం: మహమ్మారిగా రూపొందిన కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు  విజయనగరం జిల్లాలో ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ద్వారా సరఫరా చేసిన ఆర్సినిక్‌ ఆల్బం–30 హోమియో మందును పంపిణీ చేయనున్నట్టు విజయనగరం జిల్లా కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌ లాల్‌ తెలిపారు. హోమియో విభాగం ద్వారా జిల్లాకు లక్ష డోసులు సరఫరా చేశారని వెల్లడించారు. జిల్లాలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నోడల్‌ ఆఫీసర్​గా స్వామిని నియమించినట్లు తెలిపారు. […]

Read More
సౌలత్ మంచిగుంది సారూ..

సౌలత్ మంచిగుంది సారూ..

– మంత్రి హరీశ్ రావుతో ఓ రైతు సారథి న్యూస్​, సిద్దిపేట: కరోనా నేపథ్యంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక రైతు మార్కెట్లలో సామాజిక దూరం పాటించాలని కూరగాయలు విక్రయిస్తున్న రైతులు, కొనుగోలుదారులకు మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ హైస్కూలులో ఏర్పాటుచేసిన తాత్కాలిక రైతు బజార్​ ను మంగళవారం ఉదయం మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా పరిశీలించారు. రైతులు, కూరగాయల విక్రయదారులతో మాట్లాడారు. ‘తాత్కాలిక మార్కెట్లలో అనుకున్న విధంగా మీకు వెసులుబాటు ఉందా..?’ అని […]

Read More
రాపిడ్ కిట్టుతో కరోనా టెస్ట్​

రాపిడ్ కిట్టుతో కరోనా టెస్ట్​

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ పరిధిలో సారథి న్యూస్​, శ్రీకాకుళం: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ పరిధిలోని అంపిలి గ్రామంలో రాపిడ్ కిట్టుతో తొలి కరోనా టెస్ట్ ను కలెక్టర్ జె.నివాస్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఏఎన్ఎం, ఆశా వర్కర్స్ నిర్వహించిన సర్వే ప్రకారం బీపీ, షుగర్.. ఇతర వ్యాధులు లేకున్నా దగ్గు, జలుబు జ్వరంతో బాధపడుతున్న వారికి రాపిడ్ కిట్టుతో కరోనా టెస్ట్ నిర్వహిస్తామన్నారు. ఆయన వెంట […]

Read More
కరోనాను కట్టడిచేద్దాం

మహమ్మారిని కట్టడిచేద్దాం

సారథి న్యూస్, శ్రీకాకుళం: కరోనా(కోవిడ్​–19) మహమ్మారిని కట్టడిచేసేందుకు స్పీకర్లు కృషి చేయాలని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా పిలుపునిచ్చారు. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై అన్ని రాష్ట్రాల శాసనసభ స్పీకర్​ లతో మంగళవారం ఆయన వీడియోకాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు. ఆరోగ్య సేతు యాప్ ను ప్రతిఒక్కరూ డౌన్ లోడ్ చేసుకుని, వినియోగించేలా అవగాహన పెంచాలని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్​ నుంచి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. మే 3వ తేదీ వరకు […]

Read More
మిల్లులకు ధాన్యం తరలించాలి

మిల్లులకు ధాన్యం తరలించాలి

రైస్​ మిల్లులకు ధాన్యం తరలించాలి సారథి న్యూస్, మెదక్: ధాన్యం కొనుగోలు, నాణ్యత పరిశీలన, రైస్ మిల్లులకు తరలింపు ప్రక్రియపై కలెక్టరేట్ లో మెదక్​ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. అకాలవర్షాలకు రైతులు ధాన్యం నష్టపోకుండా వెంటనే రైస్​ మిల్లులకు తరలించాలని సూచించారు. హమాలీలను సమకూర్చుకోవాలని ఆదేశించారు. రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించేందుకు ఆన్​ లైన్​లో అప్​ లోడ్​ చేయాలన్నారు. మిల్లుల్లో ఖాళీ అయిన గోనె సంచులను వెంటనే గోదాంలకు తిరిగి […]

Read More
ఆన్​ లైన్​

ఆన్​ లైన్​ క్లాసెస్​ ప్రారంభం

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో  స్టూడెంట్స్​ ఇంటి వద్దనే ఉండి పాఠాలను నేర్చుకునేందుకు ఆన్​ లైన్​లో 3డీ డిజిటల్ లెర్నింగ్ తరగతులను మంత్రి వి.శ్రీనివాస్​ గౌడ్​, మహబూబ్​ నగర్​ కలెక్టర్​ వెంకటరావు మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈవో ఉషారాణి పాల్గొన్నారు. హైవే పనుల పరిశీలన మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల వరకు కొనసాగుతున్న హైవే పనులను మంత్రి పరిశీలించారు. బ్రిడ్జి, డ్రెయిన్​ పనులను పరిశీలించారు. పనులను నాణ్యవంతంగా చేయాలని ఆదేశించారు.

Read More
కూరగాయలు పంపిణీ

కూరగాయలు పంపిణీ

సారథి న్యూస్​, మహబూబ్​నగర్​: బీజేపీ అధినాయకత్వం  పిలుపు మేరకు మంగళవారం మహబూబ్ నగర్ మండలం ఓబులాయిపల్లిలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాకుల బాలరాజు ఆధ్వర్యంలో కూరగాయలు పంచిపెట్టారు. రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు అంజమ్మ మాస్క్​లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు రాజుగౌడ్, జాం శ్రీనివాసులు, కిరణ్ కుమార్ రెడ్డి, రామకృష్ణ, అంజయ్య, దర్పల్లి హరి, శివారెడ్డి పాల్గొన్నారు.

Read More