సారథి న్యూస్, హైదరాబాద్: లాక్‌డౌన్ పొడిగింపుపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించామని.. మరింత కట్టుదిట్టంగా దాన్ని అమలు చేస్తామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్(సీపీ) అంజనీకుమార్ స్పష్టం చేశారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలపై ఆంక్షలు ఉన్నాయని, వాటిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో సీపీ మాట్లాడారు. నగరంలో 12వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నారని, సున్నితమైన ప్రాంతాల్లో విధులు నిర్వహించే వారికి పీపీఈ కిట్లు అందజేశామన్నారు. అత్యవసరమైతే పాసులు […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, మారేడ్‌పల్లి, జేబీఎస్, బేగంపేట, లంగర్‌హౌస్, గోల్కొండ, టోలీచౌకి, కార్వాన్, మెహిదీపట్నం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, గాజులరామారం, షాపూర్‌నగర్, కూకట్‌పల్లి, కొంపల్లి, సుచిత్ర, చింతల్, దుండిగల్, రాజేంద్రనగర్, అత్తాపూర్, గండిపేట్, కిస్మత్‌పూర్, బండ్లగూడ జాగీర్, శంషాబాద్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ నిలిచిన ప్రాంతాల్లో […]
సారథి న్యూస్, హైదరాబాద్: లాక్‌డౌన్ టైంలోబయటకు వెళ్లాలనుకుంటున్నారా.. ఇదివరకు ఏదో ఒకటిచెప్పి లోకల్‌లో తిరిగేశారు. కానీఇకపై ఆన్ లైన్‌లో పాస్ తీసుకోవాల్సిందే. ఇందుకోసం పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా ఓ వీడియో రూపొందించి విడుదల చేసింది. ఈ పాస్ కావాలంటే ముందుగా వీడియోలో తెలిపినట్లుగా వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అప్లికేషన్ ఫామ్ నింపాలి. ఆ తర్వాత ఫొటో, ఆధార్ కార్డు అటాచ్ చేయాలి. పది నిమిషాల్లో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అప్రూవ్ చేస్తారు. ఇది మన […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రైవేట్ పాఠశాలలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఏ రూపంలోనూ ఫీజులు పెంచొద్దు అని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 21 నుంచి ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు నిర్వహిస్తామన్నారు. టీ శాట్ ద్వారా రోజుకో […]
సారథి న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిపై కట్టడి ఎక్కువ చేశారు. జోగుళాంబ గద్వాల రెడ్ జోన్ గా ఉన్నందున అక్కడి నుంచి వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు, అమరచింత మండలాలకు పూర్తిగా రాకపోకలు నిషేధించారు. ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే కేసులు పెడతామని ఆత్మకూరు సీఐ సీతయ్య హెచ్చరించారు. జూరాల ప్రాజెక్టు వద్ద గేటు తాళాలు విరగ్గొట్టి ఆత్మకూరు అమరచింత మండలం రాత్రిపూట అక్రమంగా వస్తున్నారని దీనిపై నిఘా ఉంచి ఎవరైనా ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటామని […]
రైతులకు ప్రభుత్వం బాసటగా.. సారథి న్యూస్, నల్లగొండ: సీఎం కేసీఆర్ ఆశించిన మేర తెలంగాణ ధాన్యభాండాగారంగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు కరోనా వైరస్ ప్రబలడంతో ఆ సంతోషాన్ని రైతులతో పంచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా వైరస్ ను నిరోధించేందుకు బత్తాయి జ్యుస్ దోహదపడుతుందని చెప్పారు. బత్తాయి, నిమ్మ రైతులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ఆయన స్పష్టంచేశారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మార్కెట్ లో బత్తాయి కొనుగోలు […]
సారథి న్యూస్, మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని రాజేంద్రనగర్ లో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సోమవారం పర్యటించారు. కరోనా వైరస్ నేపత్యంలో ప్రజలెవరూ బయటి రాకూడదని సూచించారు. కోవిడ్ బారినపడకూడదని కోరారు. స్థానిక నిర్మల్ డయాగ్నస్టిక్స్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులు, పండ్లను మంత్రి పంపిణీ చేశారు.
మెదక్ పట్టణంలోని అజంపురా కాలనీని ఆరెంజ్ జోన్ గా… సారథి న్యూస్, మెదక్: కరోనా నివారణకు ప్రజలంతా సహకరించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని అజంపురా కాలనీని ఆరెంజ్ జోన్ గా ప్రకటించడంతో ఎమ్మెల్యే సోమవారం ఆ ప్రాంతంలో పర్యటించారు. అజంపురాలో నలుగురికి కరోనా పాజిటివ్ రాగా ట్రీట్ మెంట్ అనంతరం వారిలో ముగ్గురికి నెగెటివ్ రాగా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారన్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా ఈ ప్రాంతాన్ని […]