సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బుధవారం ఒకే రోజు 891 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 10,444కి చేరింది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 719 కేసులు, రంగారెడ్డి జిల్లా నుంచి 86, మేడ్చల్‌జిల్లా నుంచి 55 అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మహమ్మారి బారిన పడి ఐదుగురు చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 225కి చేరందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. చికిత్స అనంతరం ఇప్పటివరకు 4361 మంది రోగులు డిశ్చార్జ్అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 5,858 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్‌బులిటెన్‌లో పేర్కొంది.
- June 24, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA
- GHMC
- TELANGANA
- కరోనా
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on 10వేల మార్క్ దాటిన కరోనా