సారథి న్యూస్, హైదరాబాద్: నివాసం ఉండటానికి, స్థిరమైన ఉపాధిని కల్పించడంలోనూ హైదరాబాద్ నగరమే అత్యత్తమని ఓ సర్వే తేల్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 34 నగరాలపై ఈ సర్వే నిర్వహించగా.. హైదరాబాద్ చాలా సేఫ్‌సిటీ అని తేలింది. విశ్వనగరంగా పేరుతెచ్చుకున్న హైదరాబాద్ ఇప్పటికే పలు సర్వేల్లో బెస్ట్సిటీగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తాజాగా హాలిడిఫై.కామ్ నిర్వహించిన సర్వేలో 34 అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ నంబర్‌వన్ గా నిలిచింది. మనదేశంలో నివాసయోగ్యమైన. సుస్థిరాభివృద్ధఙ చెందిన నగరాలపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది అందులో హైదరాబాద్ టాప్సిటీగా తేలింది. హైదరాబాద్ సిటీ.. దక్షిణ భారతదేశానికి న్యూయార్క్ సిటీ అని సర్వే సంస్థ అభివర్ణించడం గమనార్హం. ఈ సర్వేలో హైదరాబాద్‌కు 5 పాయింట్లకు గానూ 4 పాయింట్లు దక్కాయట. దీంతో ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. తెలంగాణ మున్సిపల్ శాఖమంత్రికి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో కంగ్రాట్స్ చెప్పారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
చంద్రబాబు సొంతడబ్బా..!
ఇక ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాత్రం తన పాత స్టైల్లో ఇదంతా నా ఘనతే అని చెప్పుకుంటున్నారట. దీనిపై టీఆర్ఎస్ శ్రేణులు, వైసీపీ శ్రేణుల సోషల్ మీడియాలో మండిపడుతున్నాయి. నిజాం కట్టించిన హైదరాబాద్‌ను నేనే కట్టించానంటూ చంద్రబాబు సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని సోషల్‌మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.