సారథిన్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి మామ, భారతిరెడ్డి తండ్రి ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గంగిరెడ్డి పులివెందులలో చాలా కాలం పాటు వైద్యుడిగా పనిచేశారు. దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డికి ఆయన మంచి మిత్రుడు. ఆయన 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. పులివెందులలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సీఎం జగన్ ఇవాళ పులివెందులకు వెళ్లనున్నట్టు సమాచారం.
- October 3, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- CARONA
- CM JAGAAN
- GANGIREDDY
- HYDERABAD
- PULIVENDULA
- TELANGANA
- పులివెందుల
- భారతిరెడ్డి
- సీఎంజగన్
- హైదరాబాద్
- Comments Off on సీఎం జగన్ మామ గంగిరెడ్డి మృతి