Breaking News

సిటీలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

సిటీలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో నూతన సంవత్సర వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. పబ్‌లు, క్లబ్బులు, బార్లకు పర్మిషన్ లేదన్నారు. స్టార్ హోటళ్లలో రోజువారీ కార్యక్రమాలకు అనుమతిచ్చారు. విస్తృతంగా డ్రంకెన్​ డ్రైవ్ ​తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే న్యూ ఇయర్​ వేడుకల నేపథ్యంలో ప్రతిరోజు డ్రంకెన్​ డ్రైవ్ పరీక్షలు నిర్వహించనున్నట్టు అడిషనల్ ట్రాఫిక్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనిల్ కుమార్ తెలిపారు.