Breaking News

సచిన్ వర్సెస్​ వార్న్

సచిన్ వర్సెస్​ వార్న్

సచిన్ వర్సెస్​ వార్న్

లెజెండ్ సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌ మధ్య క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన బెస్ట్ మ్యాచ్​ లను హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్‌ గుర్తుచేశాడు. చెన్నై చిదంబరం స్టేడియంలో 1988లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య టెస్ట్​ మ్యాచ్‌ సందర్భంగా జరిగిన ఆసక్తికర సంఘటనలను వెల్లడించాడు.  ‘ఈ మ్యాచ్‌ కోసం సచిన్ బాగా ప్రిపేరయ్యాడు. వార్న్ కూడా సూపర్ ఫామ్ ​లో ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తు మాస్టర్ తొలి ఇన్నింగ్స్​ లో 4 రన్​ లకే ఔటయ్యాడు.

ఓ ఫోర్ కొట్టి ఆ వెంటనే మిడాన్ మీదుగా భారీ షాట్ ఆడాడు. కానీ బాల్ బాగా టర్న్ కావడంతో టేలర్​ కు చిక్కాడు. ఔట అయ్యానన్న బాధలో సచిన్ ఫిజియో రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. దాదాపు గంట తర్వాత బయటికి వచ్చాడు. అప్పుడు అతని కళ్లు ఎర్రగా మారాయి. అంత ఈజీగా వికెట్ ఇచ్చుకున్నందుకు చాలా భావోద్వేగానికి గురయ్యాడు.

కానీ సెకండ్‌ ఇన్నింగ్స్​ లో మాత్రం చాలా భిన్నంగా, తెలివిగా ఆడాడు. వార్న్  లెగ్ స్టంప్‌ మీదుగా రఫ్ ఏరియాల్లో వేసిన బాల్స్​ ను రోప్ దాటించాడు. వార్న్‌  లెంగ్త్ బాల్స్ వేస్తే సచిన్.. మిడాన్, మిడాఫ్‌ మీదుగా షాట్లు బాదేస్తూ సెంచరీ(155) కొట్టేశాడు. సచిన్‌, వార్న్‌ మధ్య నేను చూసిన బెస్ట్ మ్యాచ్ ఇదే’ అని వీవీఎస్‌ వివరించాడు.