సారథిన్యూస్, రామడుగు: జ్ఞానాన్ని, పెంచి విజ్ఞాన జ్యోతి ని వెలిగించేది గ్రంథాలయం, ఎంతో మందిని ఉన్నతులుగా తీర్చిదిద్ది, పోటీ పరీక్షలకు ఉపయుక్త మైన పుస్తకాలతో కళలాడే గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకొని, పాఠకులు రాక బోసిపోతున్నది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలకేంద్రంలోని గ్రంథాలయం, పెచ్చులుడి శిథిలావస్థకు చేరింది. ఊరి మధ్యలో ఉన్న ఈ గ్రంథాలయానికి గతంలో పాఠకులు వచ్చేవారు కానీ సిబ్బంది లేక, గ్రంథపాలకుడు సమయపాలన పాటించకపోవడంతో ఈ మధ్య ఎవరూ రావడం లేదు. ప్రస్తుతం గ్రంథాలయ పరిసరాలన్నీ పిచ్చి మొక్కలతో ఎంతో అపరిశుభ్రంగా తయారైంది. అధికారులు పట్టించుకొని గ్రంథాలయాన్ని బాగుచేయాలని పుస్తకాభిమానులు కోరుతున్నారు.
- October 7, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- ANDHRAPRADESH
- HYDERABAD
- KARIMNAGAR
- TELANGANA
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on శిథిలావస్థలో గ్రంథాలయం