సారథి న్యూస్, వెంకటాపురం: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతులకు గుదిబండ లాంటిదని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఏఐసీసీ పిలుపుమేరకు ములుగు జిల్లా నుగూరు వెంకటాపురం మండలకేంద్రంలో ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు అధాని, అంబానీ కోసమేనని విమర్శించారు. బిల్లు ప్రకారం సప్లై చైన్ లో రైతులనుంచి రీటైలర్ వరకూ ఎవరు ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నల్లేల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఆయుబు ఖాన్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరుస వడ్ల వెంకన్న, జెడ్పీటీసీ నమ కరం చంద్ గాంధీ, చిటమట రఘు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోతు రవి చందర్, సహకార సంఘం చైర్మన్ చీడం మోహన్ రావు, ఎంపీపీ చెరుకూరి సతీశ్, వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్, సర్పంచ్ తాటి సరస్వతి, ఎంపీటీసీ సీతా దేవి, రవి, లక్ష్మి, గుడ్ల దేవేందర్, ఖలీల్ ఖాన్, చిడెం శివ, వావిలాల ఎల్లయ్య, మన్యం సునీల్ తదితరులు పాల్గొన్నారు.
- October 3, 2020
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- షార్ట్ న్యూస్
- CONGRESS
- HYDERABAD
- MULUGU
- TELANGANA
- ఎమ్మెల్యే
- కాంగ్రెస్
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on వ్యవసాయ బిల్లు.. రైతులకు గుదిబండ