Breaking News

రికార్డు స్థాయిలో కరోనా కేసులు


సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో శనివారం 253 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. 24 గంటల్లో 8 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 182 మంది చనిపోయారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 179 కేసులు, సంగారెడ్డి జిల్లా నుంచి 24 పాజిటివ్​ కేసులు, మేడ్చల్​ జిల్లా నుంచి 14 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 11, మహబూబ్​ నగర్​లో నాలుగు, వరంగల్​ రూరల్​ జిల్లాలో రెండు, వరంగల్​ అర్బన్​ జిల్లాలో రెండు, కరీంనగర్​ రెండు, నల్లగొండ రెండు, ములుగు రెండు, రాజన్న సిరిసిల్ల రెండు, మంచిర్యాల జిల్లాలో రెండు చొప్పున పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో పాజిటివ్​ కేసుల సంఖ్య 4737కు చేరింది. వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతూ 2,352 మంది డిశ్చార్జ్​ అయ్యారు. 2,203 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.