డ్రగ్స్‌కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ రేపు ( శుక్రవారం)
ఎన్సీబీ ( నార్కోటిక్స్ కంట్రల్ బ్యూరో) మందుకు వెళ్లనున్నది. అయితే రకుల్ విచారణంలో ఎవరెవరరి పేర్లు చెబుతుందోనని టాలీవుడ్లో టెన్షన్ నెలకొన్నది. డ్రగ్స్‌కేసులో రకుల్ పేరు వచ్చాక పలు నాటకీయపరిణామాలు చోటుచేసుకున్నాయి. రియా చక్రవర్తి చెప్పిన పేర్లలో రకుల్ ప్రీత్‌సింగ్ పేరు ఉందంటూ ఇటీవల నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో రకుల్ ఒక్కసారిగా మీడియాపై మండిపడింది. అనవసరంగా తన పేరును లాగుతున్నారని హెచ్చిరించింది. అయితే రియా చెప్పిన లిస్ట్‌లో రకుల్ పేరు కూడా ఉన్నదని ఎన్సీబీ స్పష్టం చేయడంతో ఆమె బండారం బయటపడింది.
నోటీసులపైనా డ్రామాలు..!
విచారణకు హాజరుకావాలని రకుల్‌కు ఎన్సీబీ నోటీసులు జారీచేసింది. ఈ విషయంపై పలు మీడియాల్లో వార్తలు వచ్చాయి. అయితే రకుల్ మాత్రం బుకాయించింది. ‘నాకు ఎటువంటి నోటీసులు రాలేదు. నేను విచారణకు వెళ్లడం లేదు’ అని చెప్పింది. దీంతో ఎన్సీబీ సీరియస్ అయ్యింది. ఆమెకు నోటీసులు జారీచేశామని విచారణకు హాజరుకాకపోతే నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. దీంతో రకుల్ వెంటనే మాట మార్చింది. ‘నాకు నోటీసులు అందాయి. శుక్రవారం ఎన్సీబీ ముందు హాజరుకాబోతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.
రకుల్ గుట్టు విప్పుతుందా?
శుక్రవారం ఎన్సీబీ చేయబోయే విచారణ కీలకంగా మారింది. ఈ కేసులో రకుల్‌పై ఎన్సీబీ ప్రశ్నల వర్షం కురిపించనున్నట్టు సమాచారం. రకుల్ ఎంతకాలం నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నది. డ్రగ్స్ కేసులో ఆమె కేవలం బాధితురాలేనా.. లేక నిందితురాలా? ఇలా పలు కోణాల్లో ప్రశ్నించనున్నారు. అయితే మంబై నంచి కొరియర్లలో హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు సమాచారం. అయితే రకుల్ నిజంగా డ్రగ్స్ తీసుకున్నారా? లేదా ఇంకెవరి కోసమైన డ్రగ్స్ కొన్నారా? అన్న విషయం రేపటి విచారణలో తేలనున్నది. అయితే ఈ కేసులో రకుల్ నోరువిప్పితే మాత్రం టాలీవుడ్లో ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు భార్య నమ్రత పేరు డ్రగ్స్ కేసులో వినిపించింది. ఇంకా ఎవరెవరి పేర్లు వస్తాయన్నదన్నది ఆసక్తికరంగా మారింది.