Breaking News

మువ్వల సవ్వడి ఆగిపోయింది

హైదరాబాద్: ప్రముఖ నాట్య కళాకారిణి, పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభానాయుడు బుధవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి శోభానాయుడు స్వస్థలం. ఆమె చిన్నప్పటి నుంచే వెంపటి చిన సత్యం వద్ద శిష్యరికం చేశారు. అనంతరం కొన్ని వేల నాట్యప్రదర్శనలు ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పేరు ప్రఖ్యాతలు సాధించారు. 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్‌లో కూచిపూడి ఆర్ట్స్ అకాడమీని స్థాపించి దాదాపు 40 ఏళ్ల పాటు వేల మందికి కూచిపూడిలో శిక్షణ ఇచ్చారు. ఆమె మృతికి పలువురు రాజకీయనాయకులు, కళాకారులు సంతాపం తెలిపారు.