Breaking News

ముందు కరోనా.. తర్వాతే ఒలింపిక్స్

ముందు కరోనా.. తర్వాతే ఒలింపిక్స్

టోక్యో: ఇప్పటికే ఏడాది వాయిదాపడిన టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణపై రోజురోజుకు అనుమానాలు పెరిగిపోతున్నాయి. కరోనా కంట్రోల్‌ చేయకపోతే గేమ్స్​ ను నిర్వహించడం సాధ్యం కాదని ఆర్గనైజింగ్‌ కమిటీ చీఫ్‌ చేసిన వ్యాఖ్యలతో జపాన్‌ ప్రైమినిస్టర్‌ షింజో అబే కూడా ఏకీభవించారు.

పూర్తిస్థాయిలో వైరస్‌ ను కట్టడి చేయకపోతే వచ్చే ఏడాది కూడా గేమ్స్ ను హోస్ట్‌ చేయడం అసాధ్యమని తేల్చిపారేశారు. ‘అథ్లెట్స్, ప్రేక్షకుల ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం. పూర్తి సురక్షితమైన వాతావరణంలోనే ఒలింపిక్స్​ ను నిర్వహిస్తాం. అలాంటి పరిస్థితులు రావాలంటే కరోనాను కట్టడి చేయాలి.

లేదంటే గేమ్స్‌ నిర్వహణ అసాధ్యం’ అని అబే వెల్లడించారు. మరోవైపు ఒలింపిక్స్ ను  నిర్వహించాలంటే కచ్చితంగా వ్యాక్సిన్‌ ఉండి తీరాల్సిందేనన్న సైంటిస్ట్​ లు, డాక్టర్ల అభిప్రాయాలను ఇంటర్​ నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) తోసిపుచ్చింది.

‘వ్యాక్సిన్‌ వస్తే మంచిదే. కానీ మాకూ డబ్ల్యూహెచ్‌వో కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. వాటిపై వర్క్‌ చేస్తున్నాం. మా ప్లాన్స్‌ ప్రకారం మేం ముందుకు వెళ్తాం. ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్‌ అంటే సాధ్యం కాకపోవచ్చు. అయినా అన్ని జాగ్రత్తలు తీసుకునే గేమ్స్​ ను  నిర్వహిస్తాం’ అని ఐవోసీ కమిటీ మెంబర్‌ జాన్‌ కోట్స్‌ వెల్లడించారు.