సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు మరో ఉక్కు వంతెన నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఎస్ఆర్ డీపీ కింద ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో నల్లగొండ క్రాస్ రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గురువారం మంత్రులు శంకుస్థాపన చేశారు. రూ 523.37 కోట్ల వ్యయంతో నల్లగొండ క్రాస్ రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు సుమారు మూడున్నర కి.మీ. పొడవునా దీన్ని నిర్మాణం జరుగుతుంది. ఈ కారిడార్ పొడవు 3.382 కి.మీ. కాగా, ఇందులో ఫ్లైఓవర్ పొడవు 2.580 కి.మీ. ఈ ఫ్లవర్ పై రెండు వైపులా రెండేసి లైన్లలో వాహనాలు ప్రయాణం సాగించొచ్చు. కార్యక్రమంలో మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మంత్రులు శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ, కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
- July 24, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- GHMC
- HYDERABAD
- STEELBRIDGE
- ఉక్కువంతెన
- జీహెచ్ఎంసీ
- హైదరాబాద్
- Comments Off on మరో ఉక్కు వంతెనకు శ్రీకారం