Breaking News

బీజేపీకి మిత్రపక్షం షాక్​

న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వ్యవసాయ రంగాల సంస్కరణ బిల్లుకు పార్లమెంట్​లో చుక్కెదురైంది. ఈ బిల్లును ఇప్పటికే విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే తాజాగా ఎన్డీఏ భాగస్వామ్యపక్షమైన శిరోమణి అకాళిదళ్​కూడా ఈ బిల్లను వ్యతిరేకింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలంటూ తమ పార్టీ ఎంపీలకు విప్​ జారీచేసింది. కాగా వ్యవసాయాన్నికొర్పొరేటీకరణ చేసేందుకు మోదీ సర్కార్​ మూడు ఆర్డనెన్స్​లన ఇటీవల తీసుకొచ్చింది. నిత్యావసర సరుకులపై ఓ ఆర్డినెన్స్‌, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే ఉద్దేశంతో మరో ఆర్డినెన్స్‌, వ్యవసాయ ఉత్పత్తులకు వాణిజ్యపరమైన ప్రోత్సాహం కల్పించే పేరుతో మరో ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టారు. వీటికి సంబంధించిన బిల్లులకు ఈ పార్లమెంట్​ సమావేశాల్లో ఆమోదం పొందాలని కేంద్రం యోచించింది. అయితే కేంద్రం తీసుకొచ్చిన బిల్లులపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉ‍త్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అయితే తాజాగా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని అకాలిదళ్‌ ఎంపీలకు విప్‌ జారీచేయడం గమనార్హం. ఉభయసభల్లోనూ ఈ బిల్లును వ్యతిరేకించాలని అకాలిదళ్‌ నిర్ణయించింది.