గత వారం అనూహ్యంగా బిగ్బాస్హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన దేవీ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్టు సమాచారం. మెహబూబ్‌కు తక్కువ ఓట్లు ఉంటే దేవీని ఎలిమినేషన్ చేశారని మొదటినుంచి ఓ ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది. మరోవైపు పవన్‌కల్యాణ్ అభిమానులు, టీవీ9ను వ్యతిరేకించారు దేవీకి నెగెటివ్‌గా ప్రచారం చేయడంతో ఆమెకు తక్కువ ఓట్లు పడ్డాయని ప్రచారం జరిగింది. అయితే దేవీ హౌస్నుంచి బయటకు వచ్చాక ఆమెకు సోషల్‌మీడియా మద్దతు లభించింది.
దేవీ లాంటి స్ట్రాంగ్ కంటెంస్టెంట్ను కుట్రపూరితంగా బయటకు పంపారన్న వాదనలు వినిపించాయి. ఎలిమినేషన్ తర్వాత వివిధ యూ ట్యూబ్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో దేవి మాటలకు చాలా మంది ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అయితే బిగ్‌బాస్ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వాలంటే రెండు వారాలపాటు క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది. దీంతో దేవి వెళతారా? లేదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే దేవీ టీవీ9లో జాబ్‌లో జాయిన్ అయ్యారు. దేవీ ఎంట్రీ ఇస్తుందా? లేదా అన్నది శని, ఆదివారాల్లో తేలనున్నది.