సారథిన్యూస్, హైదరాబాద్: బతుకమ్మ సంబురాలు ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ప్రతి ఏడాది పెద్దల అమావాస్య రోజున ఈ పండుగను ప్రారంభిస్తారు. అయితే ఈ ఏడాది అధిక ఆశ్వయుజ మాసం రావడంతో బతుకమ్మ పండుగ ఎప్పుడు జరుపుకోవాలన్నదానిపై సందిగ్ధం నెలకొన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ బ్రాహ్మణ సేవాసమితి బతుకమ్మ పండుగపై ఓ క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్ 17న ఎంగిలిపూల బతుకమ్మ జరుపుకోవాలని దానికోసం ఏర్పాట్లు చేయాలని బ్రాహ్మణ సేవా సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అక్టోబర్ 24వరకు బతుకమ్మను పేర్చి, పూజించి జానపదాలతో ఆడి నిమజ్జనం చేయాలని తెలిపింది. కరోనా మహమ్మారి విస్తరించిన ప్రస్తుత తరుణంలో బతుకమ్మ పండుగ జరుగుతుందో లేదో వేచి చూడాలి. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ ప్రత్యేకపండుగ.. రంగురంగుల పూలతో మహిళలు, యువతులు బతుకమ్మలను అలంకరించి.. దాని చుట్టూ ఉయ్యాలపాటలు పాడుతారు. అనంతరం సమీపంలోని సరస్సు, లేదా నీటి కొలనులో బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బతుకమ్మ పండుగపై నెలకొన్న సందేహాలపై బ్రాహ్మణ సమాఖ్య ఓ క్లారిటీ ఇచ్చింది.