సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రతి గ్రామంలోనూ 50 కల్లాలు నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయితీ సెక్రటరీలు నెలలో 3రోజులు అనుమతి లేకుండా విధులకు గైర్హాజతే సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, డీఆర్డీవో గోపాల్ రావు, డీపీవో సురేశ్, డీఎఫ్ వో శ్రీధర్, ఆర్డీవో జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన హుస్నాబాద్ ఎంపీడీవో సత్యనారాయణను కలెక్టర్ సస్పెండ్ చేశారు.