అమరావతి: బిగ్బాస్ఫేం, పవన్‌కల్యాణ్ అభిమాని, ‘పరాన్నజీవి’ దర్శకుడు నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడు ఘోర అవమానానికి గురయ్యాడు. కర్రి శ్రీకాంత్ అనే ఓ దళిత యువకుడు నూతన్ నాయుడు ఇంట్లో పనిచేస్తున్నాడు. నూతన్ భార్య మధుప్రియ శ్రీకాంత్‌పై దొంగతనం నేరం మోపడంతో అతడు పనికి రావడం లేదు. ఈ క్రమంలో నూతన్ నాయుడు భార్య మధుప్రియ.. శ్రీకాంత్‌ను తన ఇంటికి పిలిపించి అతడికి గుండు కొట్టించింది. కాగా ఈ ఘటనపై దళితసంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ ఘటనపై బాధితుడు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నూతన్ నాయుడు పవన్‌కల్యాణ్ వీరాభిమాని.. ఇటీవల రాంగోపాల్‌వర్మపై పరాన్నజీవి అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. జనసేన నాయకులతో నూతన్ సన్నిహితంగా ఉంటాడు. 2014లో కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ తరఫున పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశాడు.
- August 29, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- ANDHRAPRADESH
- HYDERABAD
- JANASENA
- PAWANKALYAN
- POLITICS
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
- పవన్‌కల్యాణ్
- హైదరాబాద్
- Comments Off on నూతన నాయుడు ఇంట్లో దళిత యువకుడికి గుండు