Breaking News

నన్ను వదిలేయండి.. డ్రగ్స్​తీసుకోలేదు

కర్ణాటక సినీ పరిశ్రమను డ్రగ్స్​ కేసు కుదిపేస్తున్నది. ఇప్పటికే హీరోయిన్లు సంజనా గల్రానీ, రాగిణి డ్రగ్స్​కేసులో అరెస్టయ్యారు. అయితే వారు సెక్స్ రాకెట్​ కూడా నడుపుతున్నట్టు పోలీసులు విచారణలో తేలింది. మరోవైపు సంజనా, రాగిణి ఎవరిపేరు బయటపెడతారో అని సర్వత్రా టెన్షన్​ నెలకొన్నది. అయితే ఇటీవల ఈ కేసులో కర్ణాటకకు చెందిన ప్రముఖ టీవీ యాంకర్​ అనుశ్రీని పోలీసులు విచారణకు పిలించారు. దీంతో అనుశ్రీ డ్రగ్స్​కేసులో ఇరుక్కున్నదంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో అనుశ్రీ ఇన్​స్టాలో ఓ వీడియోను పోస్ట్​చేశారు. తాను కేవలం విచారణకు మాత్రమే వెళ్లానని.. ఏ తప్పు చేయలేదని.. మీడియా తనపై అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది.