- దుబ్బాకలో పోటీకి టీడీపీ, వామపక్షాలు లేనట్లేనా?
- క్లారిటీ ఇవ్వని ఆయా పార్టీల అదినాయకత్వం
సారథి న్యూస్, దుబ్బాక: నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ తారజువ్వలా వెలిగిన పార్టీలు ఇప్పుడు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. గతేడాది క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీలు తమ ఉనికిని కాపాడుకుకోలేకపోగా, అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కనిపించ లేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత క్రమంగా ఆ చదరంగంలో మసకబారిపోతున్న ఆపార్టీల భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అన్ని పార్టీలకంటే ఎక్కువ ఏళ్లు ఆపార్టీ అధికారం చెలాయించింది. కానీ స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో టీడీపీ తన పట్టు కోల్పోతూ వచ్చిందని ప్రజల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఆపార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఇక వామపక్ష పార్టీలు సైతం ఇదే కోవాలోకి వస్తాయి. గతంలో నామమాత్రపు స్థానాలకే పరిమితమైన వామపక్షాలు ఇప్పుడు ఎక్కడా రాష్ట్రంలో జరిగిన ఏ ఎన్నికలను పరిశీలించిన ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
గెలుపు ఎవరిది?
రాష్ట్రంలో ఎన్నికలు వచ్చయంటే రాజకీయ పార్టీల్లో సందడి సందడిగా నెలకొనేది. ఇటీవల దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు ఏర్పాట్లు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర దుబ్బాక ఉపఎన్నికలు రాష్ట్రంలోనే హాట్ టాఫిక్ గా మారాయి. ఆ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు లేకపోయే సరికి త్రిముఖ పోరే జరిగేలా కనిపిస్తోంది. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే బైపోల్ వార్ సాగనుంది. తెలంగాణ జన సమితి, వామపక్షాలు ఇప్పటివరకూ ఈ ఎన్నికపై నోరు మెదకపోవడంతో ఆ పార్టీలు ఇక పోటీలో లేనట్టే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ పార్టీల మద్దతు ఎవరికి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత అనుభవాల దృష్ట్యా టీజేఎస్, కాంగ్రెస్ కు సపోర్ట్ చేయొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇస్తేనే .. దుబ్బాకలో కాంగ్రెస్ కు ప్రొఫెసర్ కోదండరాం అండ్ కో సహకరించే విధంగా షరతు పెట్టొచ్చన్న అంచనాలు ఉన్నాయి. కానీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా పోటీలో నిలబడే అవకాశాలు ఉన్నాయి. దీంతో దుబ్బాకలో టీజేఎస్ ఎవరికీ మద్దతిచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇక సీపీఐ పార్టీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేయబోమని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఎవరికి మద్దతిచ్చే విషయాన్ని మాత్రం నేటికి తేల్చుకోలేకపోయింది. ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించే లౌకికపార్టీకి మద్దతు ఇస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పకనే చెప్పినట్లు ఆ పార్టీ నాయకుల్లో చర్చనీయాంశంమైంది. అయితే ఆ లౌకికపార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్ నా అనే విషయాన్ని చెప్పలేదు. మరో పార్టీ సీపీఎం ఇంతవరకు ఈ ఉప ఎన్నికలపై స్పందించలేదు. కేవలం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మాత్రమే దుబ్బాక ఉప పోరులో తమ అభ్యర్థి విషయంలో క్లారిటీ ఇవ్వగా.. మిగతా పార్టీలు మాత్రం నేటికి శాసనసభ ఎన్నికలకు దూరంగా ఉండడం ఇదే మొట్టమొదటి సారని విశ్లేషకులు చెబుతున్నారు.