సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి పెరుగుతోంది. మంగళవారం(24 గంటల్లో) రాష్ట్రంలో 2,734 పాజిటివ్ కేసుల నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,27,697 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 9 మృత్యువాతపడగా, ఇప్పటివరకు మరణాల సంఖ్య 836కు చేరింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 31,699గా నమోదైంది. కాగా, గత 24 గంటల్లో 38,351 శాంపిల్స్ కలెక్ట్ చేశారు. మరో 878 పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం హోంఐసోలేషన్ లో 24,598 మంది ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 347 కేసులు నిర్ధారణ అయ్యాయి.
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. భద్రాద్రి కొత్తగూడెం 117, కరీంనగర్ 106, ఖమ్మం 161, మేడ్చల్ 121, నల్లగొండ 191, నిజామాబాద్ 114, రంగారెడ్డి 212, సిద్దిపేట 109, సూర్యాపేట 107, వరంగల్ అర్బన్ 112 చొప్పున అత్యధికంగా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్‌బులెటిన్ ను విడుదల చేసింది.