సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం(24 గంటల్లో) కొత్తగా 2,137 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,71,306కు చేరింది. 2,192 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్అయ్యారు. ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 1,39,700కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 8 మంది మృత్యువాతపడ్డారు. మొత్తంగా వ్యాధి కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 1,033కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,573 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, శనివారం ఒక్కరోజే 53,811 శాంపిళ్లను టెస్ట్చేశారు.
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ 20, భద్రాద్రి కొత్తగూడెం 51, జీహెచ్ఎంసీ 322, జగిత్యాల 42, జనగామ 34, జోగుళాంబ గద్వాల 27, కామారెడ్డి 60, కరీంనగర్ 132, ఖమ్మం 90, మహబూబ్నగర్ 28, మహబూబాబాద్72, మంచిర్యాల 38, మెదక్ 28, మేడ్చల్ మల్కాజిగిరి 146, నాగర్కర్నూల్ 37, నల్లగొండ 124, నిర్మల్ 24, నిజామాబాద్72, పెద్దపల్లి 48, రాజన్న సిరిసిల్ల 57, రంగారెడ్డి 182, సంగారెడ్డి 65, సిద్దిపేట 109, సూర్యాపేట 61, వికారాబాద్ 29, వనపర్తి 29, వరంగల్ రూరల్ 24, వరంగల్ అర్బన్ 90, యాదాద్రి భువనగిరి 35 చొప్పున పాజిటివ్కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్ను విడుదల చేసింది.