సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం 1,921 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 88,396కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ ను విడుదల చేసింది. తాజాగా కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 674కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,210 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 64,284కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 23,438 ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,11,196 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 356 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 168, రంగారెడ్డి జిల్లాలో 134, సంగారెడ్డిలో 90, సిద్దిపేట జిల్లాలో 63, కరీంనగర్ జిల్లాలో 73, నల్గొండ జిల్లాలో 73, సూర్యాపేట 47, జోగుళాంబ గద్వాల జిల్లాలో 51, కామారెడ్డిలో 44, మహబూబ్‌నగర్‌లో 48, జగిత్యాల జిల్లాలో 40, జనగామ జిల్లాలో 38 కేసులు నమోదయ్యాయి.
- August 14, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA
- GHMC
- HEALTH
- HYDERABAD
- KCR
- NEWCASES
- TELANGANA
- కొత్తకేసులు
- జీహెచ్‌ఎంసీ
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on తెలంగాణలో 1,921 కరోనా కేసులు