Breaking News

తెలంగాణలో 1,842 కరోనా కేసులు

తెలంగాణలో 1,842 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం(24 గంటల్లో) 1,842 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇలా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,0,6091కు చేరింది. మహమ్మారి బారిన తాజాగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 761కు చేరింది. కాగా, 24 గంటల్లో వైరస్‌ నుంచి 1,825 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 82,411కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,919 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో వ్యాధిబారిన పడి కోలుకున్నవారి రికవరీ రేటు 77.67 శాతంగా నమోదైంది. 24 గంటల్లో రాష్ట్రంలో 36,282 కోవిడ్‌19 నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 9,68,121 మెడికల్​టెస్టులు చేశారు. కాగా, అత్యధికంగా హైదరాబాద్‌లో 373 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

తెలంగాణ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​

ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్​23, భద్రాద్రి కొత్తగూడెం 37, జగిత్యాల 70, జనగామ 24, జోగుళాంబ గద్వాల 33, కామారెడ్డి 20, కరీంనగర్​134, ఖమ్మం 77, మహబూబ్​నగర్​42, మహబూబాబాద్​64, మంచిర్యాల 59, మేడ్చల్​ 32, నాగర్​కర్నూల్ 32, నల్లగొండ 47, నిజామాబాద్​158, రంగారెడ్డి 109, సంగారెడ్డి 50, సిద్దిపేట 86, సూర్యాపేట 113, వనపర్తి 50, వరంగల్​అర్బన్​ జిల్లాలో 74 చొప్పున పాజిటివ్​కేసుల చొప్పున నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది.