సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం కొత్తగా 1,286 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 మరణాలు సంభవించినట్లు మీడియా బులెటిన్లో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 391, రంగారెడ్డి జిల్లాలో 121 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 68,946కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి 49,675 మంది కోలుకున్నారని వెల్లడించారు. 18,708 మంది చికిత్స తీసుకుంటున్నారు. వ్యాధి బారినపడి ఇప్పటి వరకు 563 మంది ప్రాణాలు విడిచారు. నిన్న ఒక్కరోజు 13,787 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
- August 4, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA
- GHMC
- HYDERABAD
- MEDIABULLETIN
- TELANGANA
- కరోనా
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on తెలంగాణలో 1,286 కరోనా కేసులు