సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇది నిజంగా శుభవార్తే. రాష్ట్రప్రభుత్వం త్వరలోనే కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. పురపాలకశాఖలో వార్డు ఆఫీసర్లు అనే కొత్తపోస్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్లో తన శాఖ అధికారులతో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్లను నియమించనున్నట్టు కేటీఆర్ తెలిపారు. వార్డు ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా వార్డు అధికారి అనే పోస్టును ప్రవేశపెట్టినట్టు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ ఖాళీల భర్తీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు మరింత అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తున్నది. నూతన పురపాలక చట్టం స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఈ అధికారులను వినియోగించనున్నారు. శుక్రవారం ప్రగతిభవన్లో కేటీఆర్ పురపాలకశాఖ అధికారులతో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పరిశుభ్రమైన పట్టణాలు, ప్రణాళిక భద్దమైన పట్టణాలు, ప్రతి పట్టణం హరిత పట్టణం కావాలన్న ముఖ్యమంత్రి అలోచనల మేరకు రూపోదించిన నూతన పురపాలక చట్టానికి అనుగణంగా ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ప్రతి వార్డుకు ఒక పురపాలక ఉద్యోగిని ఉంచే లక్ష్యంలో వార్డు అఫీసర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. ఇలా అన్ని వార్డుల్లో ఒక అధికారి ఉండడం దేశంలోనే మెదటిసారిని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
పారదర్శకంగా నియామకాలు..
వార్డు ఆఫీసర్ల పోస్టులను నియామకాలను అత్యంత పారదర్శకంగా చేపడతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. వార్డు అఫీసర్ల నియామకం ద్వారా ప్రజలకు పురపాలక శాఖకు అవసరమైన వారధి ఎర్పడుతుందని, తద్వారా పురపాలనా అంటే పౌర పాలన అనే స్పూర్తి నిజం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. పురపాలకశాఖ ఇంజనీరింగ్ పనులంలో ప్రస్తుతం జరుగుతున్న అసాధారణ జాప్యం అరికట్టేందుకు ఇద్దరు ఛీప్ ఇంజనీర్లను ఉంచేలా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.