తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ బుధవారం సాయంత్రం కన్నుమూశారు. కొంత కాలంగా కరోనాతో అనారోగ్యంతో బాధపడుతున్న దుర్గాప్రసాద్ చైన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే హఠాత్తుగా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దుర్గా ప్రసాద్ గతంలో చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో వైఎస్సార్ సీపీలో చేరి తిరుపతి ఎంపీగా విజయం సాధించారు. దుర్గాప్రసాద్ మృతికి సీఎం జగన్ సంతాపం తెలిపారు. ఆయన కుమారుడికి ఫోన్‌చేసి ఓదార్చి ధైర్యం చెప్పారు.
- September 16, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- ANDHRAPRADESH
- CHANDRABABU
- CM JAGAN
- DURGAPRASAD
- LOKESH
- MP
- TDP
- YSRCP
- ఆంధ్రప్రదేశ్
- ఎంపీ
- కన్నుమూత
- దుర్గాప్రసాద్
- Comments Off on తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ కన్నుమూత