తెలుగుదేశం పార్టీ మహిళా నేత దివ్య వాణి తెలంగాణ ప్రభుత్వం, డ్రగ్స్ కేసుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘గతంలో ఓ సారీ టాలీవుడ్లో డ్రగ్స్‌కేసు అంటూ హడావుడి చేశారు. ఈ కేసు ఎందుకు మరుగున పడింది. విచారణ ఎందుకు ఆగిపోయింది. అందులో ఎవరెవరు ఉన్నారు.’ అంటూ వ్యాఖ్యానించారు. సోమవారం టీడీపీ-టీఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘తెలంగాణ మహిళా కమిషన్ ఆవశ్యకత-ఏర్పాటు’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో దివ్యవాణి మాట్లాడారు. ఇంకా ఆమె ఎమన్నారంటే.. ‘సినీరంగంలోనూ డబ్బున్న వాళ్లదే రాజ్యం. రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఉన్నదేంటి? ప్రణీతకు లేనిదేంటి? రకుల్‌కే వరుస ఆఫర్లు వస్తుంటాయి. ప్రణీతను ఎందుకు పక్కనపెట్టారు. అవసరాల సినీరంగంలోని కొంతమంది ఎంతకైనా దిగజారుతారని పేర్కొన్నారు. దివ్యవాణి కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.