Breaking News

మందులు కొనేవారిపై ఓ కన్నేయండి

మందులు కొనేవారిపై ఓ కన్నేయండి

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలకు మెడికల్ షాపుల్లో మందులు కొనేవారిపై దృష్టిపెట్టాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ ఈ.శ్రీధర్ సూచించారు.

ఈ లక్షణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టర్ క్యాంపు ఆఫీసులో డాక్టర్లతో సమీక్షించారు. ఫీవర్ టెస్ట్ లను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.

జిల్లాలో ఇద్దరు కరోనా పాజిటివ్ వ్యక్తులను జిల్లా ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మనుచౌదరి, డీఎంహెచ్ వో సుధాకర్ లాల్, సీపీవో మోహన్ రెడ్డి, డాక్టర్ నిఖిత, డాక్టర్ ప్రవళిక, డాక్టర్ శ్రవణ్ పాల్గొన్నారు.

కరోనా జాగ్రత్తలు.. పెన్ డ్రైవ్ ఆవిష్కరణ

కరోనాపై అవగాహన కల్పించేందుకు నాగర్ కర్నూల్ పట్టణ కళాభారతి సాంస్కృతిక కళాసంస్థ కళాకారులు తయారుచేసిన పాటలు, హరికథ, బుర్రకథ, గొల్లసుద్దులు, రాక్షసి అంతం, కరోనాతత్వం, కరోనా జాగ్రత్తలతో రూపొందించిన పెన్ డ్రైవ్ ను బుధవారం కలెక్టరేట్ క్యాంపు ఆఫీసులో కలెక్టర్ ఈ.శ్రీధర్ విడుదల చేశారు.

జిల్లా ప్రజలు లాక్ డౌన్ సందర్భంలో అపోహలు చెందకుండా స్వీయ నిర్బంధంలోనే ఉంటూ జాగ్రత్తలు       తీసుకునేలా కళాకారులతో రూపొందించినట్లు కళాభారతి అధ్యక్షుడు ఎస్ బీ శ్రీనివాస్, పద్మాలయ ఆచార్య తెలిపారు.