సారథిన్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో కొన్ని నిబంధనలతో 25 శాతం బస్సులు నడిపిందేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. నిబంధనలు అమలు చేస్తూ అన్ని రూట్లలో బస్సులు నడపనున్నట్టు సమాచారం. ఈ మేరకు గురువారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వెల్లడించారు. కరోనా లాక్ డౌన్ అప్పటి నుంచి హైదరాబాద్‌లో బస్సులు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం నుంచి బస్సులు తిరిగి ప్రారంభం కానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 29 డిపోలలో ఉన్న దాదాపు 2800 బస్సుల్లో 25 శాతం బస్సులు రాకపోకలు సాగించనున్నాయని చెప్పారు. కరోనాను దృష్టిలో ఉంచుకుని వైరస్ ప్రబలకుండా ఉండేందుకై మార్చి 22 నుంచి ఇప్పటి వరకు సిటీలో బస్సులను నడపలేదని, అయితే సామాన్య ప్రజల రవాణా ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో హైదరాబాద్ రీజియన్ లో సుమారు 1700 బస్సులు, సికింద్రాబాద్ రీజియన్ లో 1200 బస్సులు ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చేవి అన్నారు. ప్రస్తుతం నడిచే 25 శాతం బస్సుల్లో కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ ఆపరేట్ చేసే విధంగా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఇప్పటికే సూచించారు.
- September 24, 2020
- Archive
- Top News
- హైదరాబాద్
- BUSES
- CARONA
- CM KCR
- HYDERABAD
- LOCKDOWN
- ROUTS
- RTC
- TELANGANA
- ఆంధ్రప్రదేశ్
- కరోనా
- తెలంగాణ
- లాక్డౌన్
- హైదరాబాద్
- Comments Off on గ్రేటర్లో రైట్‌రైట్!