సారథి న్యూస్, హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్, తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలో జరుగబోయే రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే పోటీచేస్తారని.. కోదండరాంకు మద్దతు ఇవ్వబోమని ఆ పార్టీ స్పష్టమైన సంకేతాలు పంపించినట్టు తెలుస్తోంది. దీంతో కోదండరాం ఏం చేయబోతున్నారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్వరలోనే తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకోనుంది. దుబ్బాక ఉప ఎన్నికకు ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చేసింది. దీంతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరగనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానం నుంచి పోటీచేసేందుకు కోదండరాం ఆసక్తిచూపారు. అందుకోసం ఆయన వామపక్షాలు, కాంగ్రెస్ మద్దతు కూడ గట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన నేతలతో తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ సమావేశమయ్యారు. పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ముఖ్యంగా చర్చించారు. టీజేఎస్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీచేస్తే సునాయాసంగా గెలుపొందవచ్చని వారు ఠాగూర్‌కు చెప్పారట. వారి విజ్ఞప్తిపై మాణిక్యం ఠాగూర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే ఇప్పుడు కోదండారం స్వతంత్రగానే పోటీచేస్తారా? లేదా తప్పుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే సోషల్‌మీడియాలో కోదండరాంకు యువత మద్దతు ఇస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయన పోటీచేయాలని వారు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో కోదండరాం ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
- September 29, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- ANDHRAPRADESH
- CONGRESS
- HYDERABAD
- KODANDARAM
- SHOAK
- TELANGANA
- కోదండరాం
- తెలంగాణ
- Comments Off on కోదండరాంకు సపోర్ట్ చేయలేం