సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీవర్షం కురుస్తోంది. కొల్చారంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆయా మండలాల్లో చాలా చెరువులు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో భారీవర్షం కురవడంతో కొల్చారం, మెదక్, హవేలీ ఘనపూర్ మండలాల పరిధిలోని మహబూబ్ నహర్ కాల్వ నిండుగా ప్రవహిస్తోంది. భారీవర్షాలు కురిసి చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకోవడంతో రైతులు, కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- July 24, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- మెదక్
- HEAVY RAIN
- KOLCHARAM
- medak
- కొల్చారం
- మెదక్
- Comments Off on కొల్చారంలో కుండపోత