- బీజేపీ ఎంపీలను ప్రశ్నించిన మంత్రి కె.తారకరామారావు
సారథి న్యూస్, హైదరాబాద్: మానవ తప్పిదాలతో చెరువులు, నాలాలు కబ్జాకు గురికావడంతో ఇటీవల కురిసిన భారీవర్షాలకు విశ్వనగరం హైదరాబాద్ నీట మునిగిందని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నా ఒక్క పైసా కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో నష్టాన్ని నివారించగలిగామని అన్నారు. వరదల సమయంలో తక్షణ రక్షణ చర్యలు చేపట్టేందుకు డిజాస్టర్రెస్పన్స్ ఫోర్స్‌ను నియమించారని తెలిపారు. హైదరాబాద్ నగరంలో కురిసిన అసాధారణ వర్షానికి ముఖ్యమంత్రి తక్షణ సహాయం కింద రూ.550 కోట్లు ప్రకటించారని, రూ.50కోట్లు మరమ్మతుల కోసం, రూ.500 కోట్లను కుటుంబాలకు తక్షణ సహాయం చేస్తున్నామని తెలిపారు. 4.3లక్షల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సాయం అందిస్తుందన్నారు. రూ.8వేల కోట్ల వరదల వల్ల నష్టం జరిగిందని అక్టోబర్ 15వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి లేఖరాస్తే ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి ఉత్తరం రాయగానే నాలుగు రోజుల్లో ప్రధాని మోడీ రూ.665 కోట్లు విడుదల చేశారని గుర్తుచేశారు. గుజరాత్ కు ప్రధాని స్వయంగా వెళ్లి రూ.500 కోట్లు విడుదల చేశారని వివరించారు. సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇన్ని రోజులు కరోనా అని… డోనేషన్స్ ఇచ్చిన పైసలు లెక్క చెప్పకపోతివి. ఎల్ ఆర్ ఎస్, బీ ఆర్ ఎస్ నుండి వసులు చేసిన పైసల లెక్కలు చెప్పకపోతివి.
ఈ లెక్కలు చెప్పకున్న పర్లేదు… నీవు నీ యప్ప, నీ మామా, నీ శెల్లి రాజకీయాలలోకి రానప్పుడు ఉన్న ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత… ఇప్పుడు ఎంత.
అవి శెప్తలేవే.
ఇప్పుడు పట్నం పేరు చెప్పి… నొక్కాలని అనుకుంటున్నావ్ రా… బట్టే బాజ్.
నిరుద్యోగ బృతి లేకపాయే… ఉద్యోగాలు లేకపాయే… మా పాణాలు అడ్డం పెట్టి తెలంగాణ తెస్తే మీ కల్వకుంట్ల ఫ్యామిలీ పాలీస్తుంది కదారా… బాడ్కౌ…