సారథిన్యూస్, రామగుండం: పరవళ్లు తొక్కుతూ, పంట చేలను తడుపుతూ, రైతన్నలను పరవశింపజేసే గోదావరి తల్లికి కాలుష్యం కాటు వేసింది. ప్రస్తుతం రామగుండం పారిశ్రామిక వాడ సమీపంలోని గోదావరి నది నీటిమధ్యలో ఓ వింత నురగ ప్రవహిస్తోంది. పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత నీరు నదిలోకి వదలడం వల్ల ఈ నురుగ వస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. మంగళవారం ఈ కాలుష్య నురుగను గమనించిన రామగుండం సీపీఐ కార్యదర్శి మద్దెల దినేశ్ కాలుష్య నియంత్రణ అధికారికి తెలిపారు. రంగంలోకి దిగిన సిబ్బంది నీటిని పరీక్షించారు.
- October 6, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- ANDHRAPRADESH
- GODAVARI
- HYDERABAD
- KARIMNAGAR
- TELANGANA
- ఆంధ్రప్రదేశ్
- గోదావరి
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on కాలిబాట కాదు.. కాలుష్య నురగ