సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం కొత్తగా 879 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల సంఖ్య 9,553కి చేరింది. యాక్టివ్ కేసులు 5,109 ఉన్నాయి. వ్యాధిబారినపడి 4,224 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మరణాల సంఖ్య 220కు చేరింది. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 652 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా నుంచి 64, మేడ్చల్ జిల్లా నుంచి 112, వరంగల్ రూరల్ జిల్లాలో 14, కామారెడ్డి జిల్లాలో 10చొప్పున కేసులు నమోదయ్యాయి.