Breaking News

కరోనాకు మరో పవర్​ఫుల్​ వ్యాక్సిన్​

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు మరో పవర్​ఫుల్​ వ్యాక్సిన్​ రాబోతున్నది. ప్రస్తుతం చివరి అంటే మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ పూర్తిచేసుకున్న ఈ వ్యాక్సిన్​ ఈ ఏడాది చివరినాటికే అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. ఈ వ్యాక్సిన్​ను ప్రముఖ సంస్థ జాన్సన్ & జాన్సన్ తయారు చేస్తున్నది. అయితే ఈ వ్యాక్సిన్​ కేవలం ఒక్కడోసు వేసుకుంటే సరిపోతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే అభివృద్ధి చేస్తున్న చాలా వ్యాక్సిన్​లు రెండు డోసుల వేసుకోవాల్సి ఉన్నది. అయితే జాన్సన్ & జాన్సన్ ఒక్క డోసు మాత్రమే సరిపోతుందని సమాచారం. ఈ వ్యాక్సిన్​పై ఇప్పటి వరకు జరిగిన అనేక ట్రయల్స్​ సత్ఫలితాలు ఇచ్చాయట. ఇప్పటికే 60 వేలమంది వలంటీర్లకు టీకాను ఇవ్వగా వారంతా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని.. వారి శరీరంలో కావాల్సిన సంఖ్యలో యాంటీ బాడీస్​ ఉత్పత్తి అయ్యాయని కంపెనీ చెబుతున్నది. అమెరికాతో పాటు దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూ దేశాల్లో ప్రస్తుతం విస్తృతంగా క్లినికల్ ట్రయల్స్​ కొనసాగుతున్నాయి. ఒకే ఒక్క డోసుతో కొవిడ్‌-19 నుంచి రక్షణ కల్పించగల సామర్థ్యం ఉన్న ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ టీకాపై పూర్తిస్థాయి సమచారం అందుబాటులోకి వస్తుందని కంపెనీ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ పాల్ స్టాఫ్ఫెల్ చెప్పారు.