సారథి న్యూస్, కంగ్టి(నారాయణఖేడ్): విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. మెదక్ జిల్లా కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి చెందిన హైమద్ షేక్(45) విద్యుత్ శాఖలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. మంగళవారం విద్యుత్‌శాఖ విధుల్లో భాగంగా తడ్కల్‌లోని ఓ పొలంలో విద్యుత్ వైర్లను బిగిస్తున్నాడు. కానీ విద్యుత్ సిబ్బంది, అధికారుల సమన్వయ లోపంతో ఆ సమయంలో విద్యుత్ సిబ్బంది కరెంట్ వేశారు. దీంతో హైమద్ విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే హైమద్ మృతిచెందాడని గ్రామస్తులు ఆరోపించారు. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
- September 22, 2020
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- ANDHRAPRADESH
- ELECTRICITY
- HYDERABAD
- KCR
- KTR
- TELANGANA
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on కరంటోళ్ల నిర్లక్ష్యం.. ఒకరు బలి