సారథి న్యూస్, నర్సాపూర్: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వ్యాధిని నివారించాలంటే ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని, రోజువారి కూలి చేసుకుని వారి పరిస్థితి దయనీయస్థితిలో మారిందన్నారు. ప్రతిఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా ఎదుర్కోవాలని ప్రజలకు సూచించారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తే మాస్కులు ధరించి దూరం పాటించాలన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తిలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో నాలుగొందల మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువులను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్యెల్యే మదన్ రెడ్డి, ,మాజీ మంత్రి సునితాలక్ష్మారెడ్డి, ఎంపీపీ స్వరూపానరేందర్ రెడ్డి నియోజకవర్గ నాయకులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధికారులు ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.
- April 24, 2020
- లోకల్ న్యూస్
- Corona
- ఎంపీ
- ఎమ్మెల్యే
- కరోనా
- సోషల్ డిస్టెన్స్
- Comments Off on ఇళ్లలోనే ఉండండి.. బయటికి రావొద్దు