సారథి న్యూస్, నర్సాపూర్: కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ఇంటింటికీ టీహెచ్ఆర్ (టేక్ హోమ్ రేషన్) పంపిణీ చేస్తుందని సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.
శనివారం మెదక్ జిల్లా కౌడిపల్లి లోని నాలుగో అంగన్ వాడీ కేంద్రం ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలు, పిల్లలకు బియ్యం, కోడిగుడ్లు, నూనె, బాలామృతం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యుడు తిరుమలేష్, అంగన్ వాడీ టీచర్ సంతోష, ఆయా రాజియా, తల్లులు పాల్గొన్నారు.