సారథిమీడియా, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను పరిష్కరించేందుకు ఈ నెల 25 న ఏర్పాటు చేయాలనుకున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు లేఖలు పంపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన కేంద్రం ఈ నెల 25 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు లేఖలు పంపింది. అయితే ఇటీవల కేంద్రజలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు కరోనా సోకడంతో ఆయన చికిత్స పొందతున్నారు. ఈక్రమంలో సమావేశాన్ని వాయిదా వేశారు.
- August 23, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
- ANDHRAPRADESH
- APEXCOUNCIL
- CM JAGAN
- CM KCR
- MEETING
- POSTPONE
- TELANGANA
- అపెక్స్ కౌన్సిల్
- కేంద్రప్రభుత్వం
- మీటింగ్
- వాయిదా
- Comments Off on అపెక్స్ మీటింగ్ వాయిదా