తాడేపల్లి: ‘అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దది. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ కూడా ఈ స్కామ్‌లో ఉన్నారు. అమరావతి అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరాం. సీబీఐ విచారణతో అందరిజాతకాలు బయటకొస్తాయి’ అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో బినామీ పేర్లతో 4 వేల 69 ఎకరాలు కొనుగోలు చేశారు. ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నది. ఫైబర్ గ్రిడ్ పేరుతో లోకేష్ బినామీలకు టెండర్లు ఇచ్చి 2 వేల కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారు. ఈ రెండు అంశాలపై బీజేపీ కూడా సీబీఐ విచారణ కోరాలి.
- September 15, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- పొలిటికల్
- AMARAVATHI
- ANDHRAPRADESH
- HYDERABAD
- TDP
- TELANGANA
- అక్రమాలు
- అమరావతి
- ఏపీ
- సీఎంజగన్
- Comments Off on అందరి జాతకాలు బయటపెడతాం