![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/RAPEEEEDDFF.jpg?fit=700%2C394&ssl=1)
ఉత్తర్ప్రదేశ్లో లైంగికదాడుల పర్వం కొనసాగుతున్నది. హత్రాస్ ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు సాగుతున్న వేళ మరో దారుణం చోటుచేసుకున్నది. తాజాగా ఓ పదిహేడేండ్ల విద్యార్థినిపై ఓ నీచుడు లైంగికదాడి చేయగా అతడి ఫ్రెండ్స్ వీడియో తీశారు. ఉత్తర్ప్రదేశ్ ఝాన్సీకి చెందిన ఓ యువతి అదే పట్టణంలో పాల్టెక్నిక్ చదువుతున్నది. కొంతకాలంగా ఆమెను ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కాలేజీకి వెళ్లిన విద్యార్థినిని సదరు యువకుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఆనంతరం ఓ ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనను అతడి ఫ్రెండ్స్ వీడియో తీశారు. ఇంట్లో చెబితే వీడియోలు సోషల్మీడియాలో పెడతామంటూ బెదిరించారు. యువతి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదుచేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.